ఆంధ్ర ప్రదేశ్కు కూడా బాగా వర్తించే ఒక భాషాప్రయోగపరమైన ఆదేశం ఎన్నికల సంఘం జారీ చేసింది.ఆ రాష్ట్ర బిజెపి ఎన్నికల అడ్వర్టయిజ్ మెంట్లలో కాంగ్రెస్ ఉపాద్యక్షుడు రాహుల్ గాంధీని పప్పు అంటూ హేళన చేయడం చెల్లుబాటు కాదని స్పష్టం చేసింది. బిజెపి బాధ్యులకు ఈ మేరకు వర్తమానం పంపించింది. మొదట్లో రాష్ట్ర ఎన్నికల సంఘం స్థాయిలోనే ఈ పదం వాడొద్దని చెప్పినా బిజెపి పట్టించుకోలేదు. తర్వాత వారు కేంద్ర అధికారులకు పంపితే అక్కడ కూడా అదే నిర్ణయం చేశారు. దాంతో బిజెపి వారు కూడా పునరాలోచనలో పడక తప్పలేదు. ఈ లోగా రాహుల్ కూడా పాత ఇమేజి తొలగించుకుని కొత్త ఉత్సాహంతో హడావుడిగా దూసుకుపోతున్నారు.ఇక ఆంధ్రప్రదేశ్ విషయానికి వస్తే అక్కడ కూడా ముఖ్యమంత్రి కుమారుడు మంత్రి లోకేవ్ పప్పు అంటూ రోజా వంటివారు చేసిన వ్యాఖ్యలు చేయడం పరిపాటి. దీనిపై లోకేశ్ నిమ్మళంగానే సమాధానం ఇచ్చారు కూడా. అయితే ఇప్పుడు గుజరాత్ ఆదేశం వైసీపీ నేతలపై కూడా ఏమైనా ప్రభావం ప్రసరిస్తుందేమో చూడాలి.