ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రకటించిన నంది అవార్డుల విజేతల జాబితాలో సిత్రాలు అన్నీ ఇన్నీ కావు. కొన్ని అవార్డులు ఓకే కానీ ఇంకొన్ని భలే కామెడీగా వున్నాయి. ఇది వరకూ అవార్డు సినిమా అంటే.. కమర్షియల్ కొలమానలకు దూరంగా వుండే సినిమాలకు అవార్డులు ఎక్కువగా వచ్చేవి. కానీ ప్రతిసారి ఇలానే అయితే ఏముంది వెరైటీ అనుకున్నారేమో.. ఈసారి మొత్తం నంది అవార్డులకు మాస్ మసాలా దట్టించేశారు. అసలు ఉహించని పేర్లు ఇందులో కనిపించాయి. అందులో ఒకటి అనుష్క సైజ్ జీరో. ఈ సినిమాకి గాను అనుష్కకి ఉత్తమ నటి అవార్డు ఇచ్చేశారు.
ఇది సిత్రమే. అట్టర్ ఫ్లాఫ్ సినిమా ఇది. పోనీ ఇందులో అనుష్క హెవీగా యాక్టింగ్ చేసేదిందా ? అంటే లేదు. హెవీ అవ్వడం తప్పితే. అమ్మాయిల శరీరంతో పనిలేదు అమ్మాయి మనసును చూడాలి అనే పాయింట్ తో ఈ సినిమా తీశాడు దర్శకేంద్రుడి పుత్ర రత్నం ప్రకాష్. అనుష్క వుందనికొన్ని టికెట్లు తెగాయి. కానీ సినిమా చుసిన జనాలు పాపం అనుష్క అనుకున్నారు. ఈ పాయింట్ చెప్పాడని సినిమా ఎందుకు ఒక షార్ట్ ఫిల్మ్ తీస్తే సరిపొతుంది కదా అనే కామెంట్లు వినిపించాయి. ఈ విషయంలో అనుష్క కూడా బాగా నిరాశ పడింది. ఎదో చేస్తానని చెప్పి నా శరీరంపై ఎక్స్పెరిమెంట్ చేసి.. తీరా ఎలాంటి ఫీల్ లేని సినిమాని చుట్టేశారు అని ఆమె సన్నిహితుల దగ్గర వాపోయిందట. ఇందులో నటన కూడా తనకు పెద్దగా రిచించలేని అనుష్కనే సన్నిహితుల దగ్గర వాయిందని అప్పట్లో చెప్పుకున్నారు. కానీ ఇప్పుడు ఆ సినిమాకే ఉత్తమ నటి అవార్డ్ ఇచ్చేశారు.
కానీ అనుష్క ఇలా ఉహించలేదు. రుద్రమదేవి తన ప్రైడ్ ని పెంచుతుందని భావించింది. ఇప్పటికీ అనుష్క అరుధంతి తర్వాత రుద్రమదేవి పేరే చెబుతుంది. ఇందులో అనుష్క నటన కూడా అమోఘం. కాకతీయ సామ్రాజ్ఞి రుద్రమాంబగా అనుష్క ఒదిగిపోయిన తీరు అద్భుతః. కానీ ఈ అద్భుతం నంది బోర్డు సభ్యులకు కనిపించలేదు. ఎవరూ వూహించని, చివరికి అనుష్క కూడా అనుకోని సైజ్ జీరోకి అవార్డ్ ఇచ్చేశారు. రుద్రమను వదిలేసి సైజు జీరోకి అవార్డు ఇచ్చినందుకు ఇప్పుడు అనుష్క నవ్వాలో బాధపడాలో అర్ధం కానీ పరిస్థితి.