రాజకీయా పార్టీ ప్రకటన రేపో మాపో ఉంటుందని ఊరించి, చివరికి మరో పది నెలల టైం కావాలని అడిగి,తుస్సుమనిపించిన కమల్ హాసన్ తన స్టేట్మెంట్స్ ద్వారా మాత్రం ఏదో రకంగా పబ్లిక్ అటెన్షన్ తెచ్చుకుంటున్నాడు.అయితే ఆ స్టేట్మెంట్సే ఆయన మీద కేసులు పెట్టడానికి కారణమవుతున్నాయి.
కమల్ హసన్ పై ఎఫ్ ఐ ఆర్ నమోదు చేయాలని మద్రాస్ హైకోర్టు ఆదేశాలు ఇచ్చింది. హిందూ ఉగ్రవాదం విషయమై కమల్ హసన్ చేసిన వ్యాఖ్యల మీద దాఖలు అయిన పిటిషన్ పై హైకోర్టు స్పందించింది. మతపరమైన వ్యాఖ్యలు చేసి తమిళ జాతిని విడగొట్టేందుకు కుట్రపన్నారంటూ పిటిషనర్ అందులో పేర్కొన్నారు. ఒక మేగజైన్ కోసం రాసిన ప్రత్యేక వ్యాసంలో హిందు ఉగ్రవాదాన్ని అరికట్టడంలో తమిళనాడు సహా దేశంలోని ప్రభుత్వాలన్నీ విఫలమయ్యాయని కమల్ వ్యాఖ్యానించిన సంగతి తెలిసిందే.
ఇక కేసులు, బెదిరింపులు తననేమీ చేయవని చేయలేవని ఆల్రెడీ చెప్పిన కమల్, ఈ కోర్ట్ ఆదేశాల పై ఏమంటాడో వేచి చూడాలి