చిరంజీవి 150వ చిత్రానికి నిర్మాతగా అవకాశం అందుకోవాలని ఉద్దండులంతా ప్రయత్నించారు. కానీ ఆ అవకాశాన్ని రామ్‌చరణ్ తెలివిగా తన దగ్గరే ఉంచుకొన్నాడు. చిరు రీ ఎంట్రీ అంటే అందరిలోనూ బోలెడంత ఆసక్తి. సినిమా ఎలా ఉన్నా, ముందస్తు బిజినెస్ బాగా జరిగిపోతుంది. అంటే టేబుల్ ప్రాఫిట్‌కు సినిమా అమ్ముకోవొచ్చు. ఈ లాభసాటి వ్యవహారాన్ని గ్రహించిన చరణ్.. చిరు సినిమా తీసే బాధ్యత తనపై వేసుకొన్నాడు. తన ప్లాన్ బాగా వర్కవుట్ అయ్యింది. ఖైది నెం.150 సూపర్ హిట్ అవ్వడమే కాకుండా, భారీ లాభాల్ని మిగిల్చింది. అదే ఉత్సాహంతో ఇప్పుడు 151వ సినిమా సైరా నరసింహారెడ్డి కీ తనే నిర్మాతగా వ్యవహరిస్తున్నాడు. దీనిపై దాదాపుగా రూ.150 కోట్లు ఖర్చు చేయాలని చూస్తున్నాడు. చరణ్ కి ఈ మొత్తం రాబట్టుకోవడం పెద్ద కష్టమేం కాదు. ప్రీ బిజినెస్ కూడా ఆ రేంజులో జరగడం ఖాయంగా కనిపిస్తోంది.
చరణ్ – కొరటాల శివ సినిమాలోనూ చరణ్ భాగస్వామిగా ఉండబోతున్నాడు. ఆ తరవాత…. ప్రొడక్షన్ జోలికి వెళ్లడట చరణ్. కొన్నాళ్ల పాటు కేవలం నటనపైనే దృష్టి పెడతానని చెబుతున్నాడు. రెండు సినిమాలకే చరణ్‌కి అలసట వచ్చేసిందా అనిపిస్తోందిప్పుడు. చిత్ర నిర్మాణం అంత ఈజీ వ్యవహారం కాదు. కానీ వినాయక్ లాంటి దర్శకుడి అండ ఉన్నప్పుడు ప్రొడక్షన్ తేలికే అవుతుంది. పైగా నాన్న సినిమా. హీరో నుంచి ఎలాంటి ఒత్తిళ్లూ ఉండవు. 151వ సినిమా విషయంలోనూ చరణ్ రిలాక్స్‌గానే ఉండొచ్చు. ఎందుకంటే అంత మంచి టెక్నీషియన్ టీమ్ పని చేస్తోంది. 150వ సినిమాకి లాభాలు చూసిన చరణ్.. 151వ సినిమా పూర్తవ్వకుండా `బాబోయ్ ప్రొడక్షన్` అంటూ కంగారు పడుతున్నాడంటే… కాస్త ఆశ్చర్యం వేస్తోంది. చరణ్ చిన్న సినిమాలు తీసే ఆలోచనలో ఉన్నాడని, శర్వానంద్‌తో ఓ సినిమా ప్లాన్ చేస్తున్నాడని ఇటీవల వార్తలొచ్చాయి. అవన్నీ గాలి కబుర్లే అన్నమాట.