టాలీవుడ్లో మరో ఆసక్తికరమైన కాంబినేషన్‌కి ఈరోజు శ్రీకారం చుట్టుకొంది. నాగార్జున – రాంగోపాల్ వర్మల చిత్రం ఈరోజు అన్నపూర్ణ స్డూడియోస్‌లో లాంఛనంగా ప్రారంభమైంది. ఈనెలలో 10 రోజుల పాటు షూటింగ్ ఉంటుంది. అఖిల్ సినిమా కోసం నాగ్ కాస్త విరామం తీసుకోబోతున్నారు. డిసెంబరు 22న అఖిల్ ‘హలో’ విడుదల అవుతోంది. ఆ తరవాత.. మళ్లీ వర్మ షూటింగ్ మొదలవుతుంది. అక్కడ్నుంచి పూర్తయ్యే వరకూ ఏకధాటిగా ఈసినిమా షూటింగ్ జరపనున్నారు. కథానాయిక, ఇతర సాంకేతిక నిపుణులెవరన్నది ఇంకా తెలీలేదు. అనుష్క కథానాయికగా నటిస్తుందని ప్రచారం జరుగుతోంది. కానీ వర్మ మాత్రం `కథానాయిక ఎవరనేది ఇంకా ఫైనల్ చేయలేదు. ఆ వివరాలు త్వరలో చెబుతా” అన్నారు. ”టెక్నికల్‌గా చాలా స్ట్రాంగ్ గా ఉండే సినిమా ఇది. ఆ విషయంలో ‘శివ’ ఓ మైల్ స్టోన్‌గా నిలిచింది. ఈ సినిమా అంతకు మించి ఉండబోతోంది” అని నాగ్ చెబుతున్నాడు. ‘శివ’ ప్రభావం ఈ సినిమాపై ఎంత వరకూ ఉంటుంది, ఇదేమైనా శివకు సీక్వెలా?? అని అడిగితే ”శివ వచ్చి 28 ఏళ్లు అయ్యింది. ఆసినిమాని అందరూ మర్చిపోతున్నారు. మళ్లీ ఆ సినిమానే తీస్తే జనాలు చూడరు. ఇంకో కొత్త కథ ఇది.. తప్పకుండా ట్రెండ్ సృష్టిస్తుంది” అంటున్నాడు నాగ్.