నందమూరి బాలకృష్ణ నటించిన డిక్టేటర్ సినిమా ఈరోజు ప్రపంచ వ్యాప్తంగా విడుదలయింది. ఆయన ప్రాతినిద్యం వహిస్తున్న హిందూపురం నియోజకవర్గంలో ఆయన అభిమానులు సరికొత్త పద్దతికి శ్రీకారం చుట్టారు. హిందూపురంలో ప్రదర్శించబోయే ఈ సినిమా తొలి షో మొదటి మూడు టికెట్లను వేలం వేశారు. ఆలిండియా నందమూరి అభిమాన సంఘం అధ్యక్షుడు ఎన్.సతీష్ అందరికంటే ఎక్కువగా రూ.13,500 చెల్లించి మొదటి టికెట్ ని స్వంతం చేసుకొన్నారు. రెండవ టికెట్ ని అదే సంఘానికి చెందిన హిందూపురం టౌన్ అధ్యక్షుడు బండారు బాలాజీ రూ.13,000 లకు దక్కించుకొన్నారు. మూడవ టికెట్ ని కిరికెర గ్రామ సర్పంచ్ హెచ్.ఎన్. రాము రూ. 10,116 చెల్లించి దక్కించుకొన్నారు. ఈ మొత్తాన్ని పేద ప్రజల సంక్షేమం కోసం ఖర్చు చేస్తామని వారు తెలిపారు.