యువీ క్రియేషన్స్ సంస్థకి ఇప్పటివరకు అన్నీ విజయాలే. ఈ సంస్థలో ఇప్పటివరకూ ఆరు సినిమాలు వచ్చాయి. మిర్చి , రన్ రాజా రన్, జిల్ , భలే భలే మగాడివో, ఎక్స్ ప్రెస్ రాజా, మహానుబావుడు. ఇవన్నీ హిట్ సినిమాలే. మంచి బడ్జెట్ ప్లానింగ్ తో దాదాపు అన్ని సినిమాల్లో లాభాలు చూసింది యువీ క్రియేషన్స్. అయితే ఇప్పుడు ఆ సంస్థ నుండి వస్తున్న ఓ సినిమా మాత్రం రిస్కీ గా మారింది. అదే అనుష్క బాగమతి.
అనుష్క టైటిల్ రోల్ ప్లే చేస్తున్న ఈ సినిమాకి అశోక్ కుమార్ దర్శకుడు. చాలా కాలంగా సెట్స్ కే పరిమితమైపోయిన ఈ సినిమా ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ లో వుంది. ఇటివలే ఈ సినిమా ఫస్ట్ లుక్ ని విడుదల చేశారు. ఓకే అనిపించింది. బాహుబలి తర్వాత అనుష్క నుండి వస్తున్న ఈ సినిమాపై ఒక్కింత ఆసక్తినెలకొంది. అయితే ఈ సినిమా బడ్జెట్ కలవరపెడుతుంది నిర్మాతలకు.
కేవలం అనుష్క మార్కెట్ ద్రుష్టిలో పెట్టుకొని ఈ సినిమాపై 40కోట్ల రుపాయిలు పెట్టేశారు. ఇప్పుడు ఆ నాలఫైకోట్లు వెనక్కి తీసుకురావడం అంటే అంత ఈజీగా కనిపించడం లేదు. అరుంధతి తర్వాత అనుష్కకి సోలో విజయాలు లేవు. పంచాక్షరీ, వర్ణ , సైజ్ జీరో, రుద్రమదేవి.. ఈ సినిమాలన్నీ నిరాశనే మిగిల్చాయి. ఈలాంటి నేపధ్యంలో అనుష్కపై 40కోట్ల అంటే రిస్క్ అనే చెప్పాలి. ఈ సినిమాని సంక్రాంతికి అనుకున్నారు. ఆ సీజన్ వచ్చింటే వసూళ్ళకు ఎక్కువ అవకాశం వుండేది. కానీ అన్ సీజన్ కి వెళ్ళిపోయిందీ సినిమా. ఇదీ కూడా రిస్క్ ఫ్యాక్టరే. మొత్తంమ్మీద తొలిసారి 40కోట్ల రిస్క్ ప్రాజెక్ట్ ని మార్కెట్ లోకి తీసుకువస్తుంది యువీ క్రియేషన్స్.