నిర్మాత బండ్ల గణేష్‌కు జైలు శిక్ష విధిస్తూ.. ఎర్రమంజిల్ కోర్టు సంచలన తీర్పు వెలువరించింది. చెల్లని చెక్కు కేసులో బండ్ల గణేష్ ఆరు నెలల శిక్ష పడింది. టెంపర్ సినిమాకు కథ అందించినందుకుగాను తనకు ఇవ్వాల్సిన రెమ్యునరేషన్ ఇవ్వలేదంటూ రచయిత వక్కంతం వంశీ కోర్టును ఆశ్రయించారు. కొన్ని రోజులుగా విచారణలో ఉన్న ఈ కేసుపై హైదరాబాద్‌లోని ఎర్రమంజిల్ కోర్టు ఈ రోజు తీర్పు వెలువరించింది. నష్ట పరిహారం కింద వంశీకి రూ. 15,86,550 చెల్లించాలని బండ్లనుఆదేశించింది.
‘టెంపర్’ సినిమాకు సంబంధించి నిర్మాత బండ్ల గణేష్, వంశీ మధ్య చాలా కాలంగా వివాదం నడుస్తోంది. వంశీకి గణేష్ ఇచ్చిన చెక్ బౌన్స్ అవడంతో వివాదం మొదలైంది. ఇపుడు కోర్టు వేసిన శిక్షతో ఈమేటర్ టాలీవుడ్ హాట్ టాపిక్ గా మారింది. అయితే వెంటనే ఆయన బెయిల్ కు అప్పీల్ చేసుకోవడంతో న్యాయస్థానం బెయిల్ మంజూరు చేసింది.