కాంగ్రెస్ పార్టీలో కి వెళ్లినప్పటి నుంచి రేవంత్ రెడ్డి చేసే ఏ విమర్శను ఆరోపణని తేలిగ్గా తీసుకునేది లేదని నిర్ణయించుకున్నట్టు కేసీఆర్ ప్రభుత్వం మరోసారి చెప్పకనే చెప్పింది.
తాజాగా హైదరాబాద్ లో జరిగిన సన్ బర్న్ నైట్ పార్టీ విషయంలో రేవంత్ టి ఆర్ ఎస్ ప్రభుత్వం పై పలు ఆరోపణలు గుప్పించారు. ఆ ఈవెoట్ నిర్వహణలో కేటీఆర్ బావమరిది రాజేంద్రప్రసాద్ కూడా భాగస్వామి అని ఆరోపించారు.
దీనిపై రాజేంద్రప్రసాద్ తీవ్రంగా స్పందించారు. తనకు ఆ ఈవెoట్ తో ఎటువంటి సంబంధం లేదని ఖండించారు. అంతే కాదు అసత్య ఆరోపణలు చేసిన రేవంత్ వెంటనే మీడియా సమక్షంలో క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేస్తూ లీగల్ నోటీసులు కూడా శనివారం పంపారు. లేని పక్షంలో క్రిమినల్ చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. తనకు హైదరాబాద్ లో పబ్స్ తో కూడా ఎటువంటి సంబంధం లేదన్నారు