త్రివిక్రమ్ శ్రీనివాస్ పై ఫారిన్ సినిమాల ప్రభావం ఎక్కువ. క్యారీ గ్రాంట్ సినిమాల నుండి ప్రస్తుతం హాలీవుడ్ బాక్సాఫీసు దగ్గర సందడి చేస్తున్న సినిమా వరకూ ఆయనకు విపరీతమైన గ్రిప్పు. క్యారీ గ్రాండ్ , రాక్ హడ్సన్, ఆండ్రీ హెర్బన్, క్యాథరిన్ హెర్బ్.. ఈ పేర్లు, వీళ్ళు చేసిన సినిమాలు గురించి అడిగితే బ్లాంక్ పేస్ పెడతారు చాలా మంది. కానీ త్రివిక్రమ్ ను అడగండి.. వికీపీడియాలో లేని సమాచారం కూడా ఆయన దగ్గర ఉటుంది. వరల్డ్ సినిమాని నమిలేసిన రచయిత, దర్శకుడు త్రివిక్రమ్. వరల్డ్ సినిమా ప్రభావం ఆయనపై చాలా ఎక్కువ. ఎంత ఎక్కువ అంటే.. ఆయన రాసిన తీసిన చాలా సినిమాల్లో హాలీవుడ్ సినిమాల లైన్స్ కనిపిస్తాయి. కొన్ని సీన్లు మక్కికి మక్కి వుంటాయి. యుట్యూబ్ లో ఆ సీన్లు ఇప్పటికే చాలా వైరల్ అయ్యాయి.
ఇక తాజాగా సినిమా విషయానికి వస్తే.. పవన్ కళ్యాణ్ అజ్ఞాతవాసి. ఈ సినిమా లైన్ ఓ హాలీవుడ్ సినిమాకి ఇన్సిపిరేషన్ అని ఎప్పటి నుండో ప్రచారంలో వుంది. అజ్ఞాతవాసి సినిమాకు 2011లో వచ్చిన ”ది హెయిర్ అప్పారెంట్” సినిమా ఇన్సిపిరేషన్ వినిపించింది. ఈ సినిమా కధ ప్రకారం.. ఓ ధనవంతుడు. అతడికి ఇద్దరు భార్యలు. ఓ కుట్రలో ఆయన చనిపోతాడు. ఇక ఆస్తి మొత్తం విలన్ బ్యాచ్ కొట్టేయాలని అనుకుటుంది. కానీ ఇక్కడ చిన్న అడ్డంకి. మొదటి భార్యకు ఓ కొడుకు వుంటాడు. అతడు ఎక్కడ వుంటాడో తెలీదు. అతడి సైన్ లేనిదే ఆస్తులు ఎవరికీ వెళ్ళవు. ఆ ధనవంతుడి రెండో భార్య.. మొదటి భార్య కొడుకు కోసం వెదక్కుంటూ వస్తుంది. అ తర్వాత కధ ఎలాంటి మలుపులు తిరిగిందనేది మిగతా స్టొరీ.
ఈ స్టొరీ లైన్ తెలుగు సినిమాకి కరెక్ట్ గా సరిపోతుంది. త్రివిక్రమ్ కూడా ఈ లైన్ కి ఫ్లాట్ అయిపోయాడట. కేవలం ఆ లైన్ ని ఇన్సిపిరేషన్ గా తీసుకొని తనదైన శైలిలో అజ్ఞాతవాసిని మలిచాడట. ఇప్పుడు ఈ సినిమా టైటిల్ ని అజ్ఞాతవాసి ని అఫీషియల్ గా ప్రకటించారు. ‘ప్రిన్స్ ఇన్ ఎక్సిల్’ అనే క్యాప్షన్ కూడా పెట్టారు. అజ్ఞాత వాసం, వారసుడు వస్తున్నాడు.. అని ఫస్ట్ లుక్ పోస్టర్ లోనే హింట్ ఇచ్చేశారు. ”ది హెయిర్ అప్పారెంట్” ట్రైలర్ చూస్తే చాలు.. అజ్ఞాతవాసి ఇన్సిపిరేషన్ నిజమే అనిపించక మానదు.