శర్వానంద్ కొత్త సినిమా పట్టాలెక్కింది. సుధీర్ వర్మ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రాన్నిసితార ఎంటర్ టైన్మెంట్స్ నిర్మిస్తోంది. ఈ రోజు ఉదయం హైదరాబాద్ లోని రామానాయుడు స్థూడియో లో వైభవంగా ప్రారంభమయింది. ఈ చిత్రంలో ఇద్దరు కథానాయికలకుచోటుంది. ఓ నాయికగా కాజల్‌ని ఎంచుకొన్నారు. మరో నాయికగా నిత్యమీనన్ ఎంపికైంది. మళ్లీ మళ్లీ ఇది రానీ రోజులో శర్వా – నిత్య మేనన్ జోడీ కట్టారు. ఆ తరవాత వీరిద్దరూకలసి నటించడం ఇదే. తెలుగులో నిత్య హవా తగ్గుతోందనుకొంటున్న తరుణంలో ఈ ఆఫర్ రావడం… టర్నింగ్ పాయింట్ అనుకోవాలి. కథానాయకుడు శర్వానంద్ పై చిత్రీకరించిన ముహూర్తపు సన్ని వేశానికి ప్రముఖ కథానాయకుడు నాగ చైతన్య అక్కినేని క్లాప్ నివ్వగా, ప్రముఖ దర్శకుడు మారుతి కెమెరా స్విచ్చాన్ చేశారు. చిత్రం స్క్రిప్ట్ ను హారిక అండ్ హాసిని సంస్థ అధినేత ఎస్.రాధాకృష్ణ చిత్ర దర్శక నిర్మాతలకు అందజేశారు. ప్రముఖ నిర్మాతలు బి.వి.ఎస్.ఎన్.ప్రసాద్, జెమిని కిరణ్, దర్శకుడు అనిల్ రావిపూడి ఈ కార్యక్రమానికి హాజరయ్యారు. డిసెంబర్లో ఈ సినిమా సెట్స్‌పైకి వెళ్లనుంది. చిత్రానికి సంగీతం : ప్రశాంత్ పిళ్ళై , ఛాయాగ్రహణం :దివాకర్ మణి, ప్రొడక్షన్ డిజైనర్: రవీందర్.