https://www.youtube.com/watch?v=dW6Hok0k-Go&feature=youtu.be
సప్తగిరి ఎక్స్‌ప్రెస్ తో కథానాయకుడిగా ఎంట్రీ ఇచ్చాడు సప్తగిరి. ఆ సినిమా తుస్సుమనిపించింది. అయినా… తన ప్రయత్నం మాత్రం మానలేదు. ఈసారి సప్తగిరి ఎల్ ఎల్ బీ గా మారిపోయాడు. బాలీవుడ్లో ఘన విజయం సాధించిన జాలీ ఎల్ ఎల్ బీకి తెలుగు రీమేక్ ఇది. సినిమా పూర్తయింది. ఇప్పుడు ట్రైలర్ బయటకు వచ్చింది. జాలీ ఎల్ ఎల్ బీ చూసిన వాళ్లకు కూడా.. ఈ ట్రైలర్ కాస్త కొత్తగానే అనిపించొచ్చు. ఎందుకంటే కమర్షియల్ టచ్ కాస్త ఎక్కువ ఇచ్చినట్టు కనిపిస్తోంది. డాన్సులు, ఫైట్లు, పంచ్ డైలాగులతో… జాలీ ఎల్ ఎల్ బీ కథని తెలుగు ప్రేక్షకుల అభిరుచికి నచ్చేలా.. మార్చేసింది టీమ్. ఆ సంగతి ట్రైలర్ చూస్తే అర్థమైపోతోంది. సప్తగిరి నుంచి ఆశించే వినోదం, డైలాగులు ఈ సినిమాలో బాగా దట్టించినట్టు కనిపిస్తోంది. పవన్ కల్యాణ్‌పై తనకున్న అభిమానాన్ని మరోసారి ఈ ట్రైలర్లో చూపించాడు సప్తగిరి. కథానాయిక ఫేస్‌ని సరిగా చూపించలేదు గానీ.. ఈ సినిమాకి ప్రధానమైన మైనస్ అయితే గియితే ఆమే అయ్యుండాలి. బాలీవుడ్లో బొమన్ ఇరానీ పాత్రలో సాయి కుమార్ నటిస్తున్నాడు. బొమన్ బాలీవుడ్లో అద్భుతంగా పండించిన పాత్ర అది. సాయికుమార్ ఏమేరకు మెప్పించాడు, సప్తగిరి కామెడీ, కథలోని ఎమోషన్స్ ఏ మేర వర్కవుట్ అయ్యాయన్న విషయంపైనే ఈ సినిమా రిజల్ట్ ఆధారపడి ఉంటుంది.