వెంకటేష్‌ని రీమేక్‌ల రారాజు అంటుంటారు గానీ, పవన్‌కల్యాణ్ కూడా తక్కువ తినలేదు. తన పాతిక చిత్రాల్లో సగం అవే ఉన్నాయి. అందులో ఫ్లాపులు, సూపర్ హిట్లు కనిపిస్తాయి. ‘వేదాళం’ రీమేక్‌పై పవన్ కల్యాణ్ దృష్టి పెట్టాడని ఎప్పటి నుంచో వార్తలు వస్తున్నాయి. ఏఎం రత్నం ఈ చిత్రానికి నిర్మాతగా వ్యవహరిస్తారని, నేసన్ దర్శకత్వం వహిస్తారని చెప్పుకున్నారు. ఈసినిమా కోసం హైదరాబాద్‌లో ఆఫీసు కూడా తెరిచేశారు. ‘కాటమరాయుడు’ ఫ్లాప్ తరవాత రీమేక్ కథల్ని పవన్ పక్కన పెట్టాలని నిర్ణయించుకున్న పిదప.. వేదాళం కూడా అటకెక్కింది. అజ్ఞాత వాసి బిజీలో ఉండి, వేదాళం గురించి పట్టించుకోలేదు. దాంతో ఈ సినిమా ఆగిపోయిందనుకున్నారంతా. అయితే.. వేదాళం రీమేక్ త్వరలోనే పట్టాలెక్కబోతోందని స్పష్టమైన సమాచారం అందింది. ఏఎం రత్నం కుమారుడు జ్యోతికృష్ణ ఈ విషయంలో క్లారిటీ ఇచ్చేశారు. ”వేదాళం రీమేక్ తప్పకుండా ఉంటుంది. త్వరలోనే ఈ సినిమా మొదలవుతుంది. స్క్రిప్టు పనులు కూడా పూర్తయ్యాయి. నేసన్ దర్శకత్వం వహిస్తారు” అని హింట్ ఇచ్చేశాడు జ్యోతికృష్ణ. సో… ‘అజ్ఞాతవాసి’ తరవాత సినిమా… ఇదే కావొచ్చు.