హైదరాబాద్ అంతా హడావుడి వాతావరణం నెలకొంది. హైటెక్ సిటీ ప్రాంతం, గచ్చిబౌలి ప్రాంతం మొత్తం కలర్ ఫుల్ గా లైట్లతో ఒక సినిమా షూటింగ్ లాంటి వాతావరణం తో కనిపిస్తోంది. ఇక ఇవాంక సదస్సు గురించి, మెట్రో గురించి – ఈ రెండు టాపిక్సే హైదరబాద్ లో ఎక్కడ చూసినా. ఈ సదస్సుకు ఉపాసన, నారా బ్రాహ్మణి వంటి వారు కూడా హాజరైన విషయం తెలిసిందే.
ఈ సదస్సులో తను ఇవాంకా ట్రంప్ వెనుక కూర్చొని ఉన్న క్లిప్పింగ్‌ని తన మామయ్య చిరంజీవి, భర్త రామ్‌చరణ్‌లు తనకు పంపినట్లుగా ఉపాసన తన ట్విట్టర్ పేజీలో పోస్ట్ చేశారు. ఇవాంకా వెనుక ఉపాసన ఉన్న క్లిప్‌ని పోస్ట్ చేసి.. ‘‘మా మామయ్య, మిస్టర్ సిలు (రామ్‌చరణ్) టీవీలో నేను కనిపిస్తున్న ఈ క్లిప్‌ని పంపించారు. పారిశ్రామిక విధానంలో మహిళలకు ప్రోత్సాహం ఇవ్వాలని నమ్ముతున్న వారికి ధన్యవాదాలు’’ అంటూ ఉపాసన హర్షం వ్యక్తం చేశారు.
హెరిటేజ్ ఫుడ్స్ ఎమ్.డిగా ఉన్న బ్రాహ్మణి జీఈఎస్ మహిళా పారిశ్రామికవేత్తల్లో స్ఫూర్తి నింపుతుందనే ఆశాభావం వ్యక్తం చేశారు. చిన్న సంస్థల్లో మహిళలకు ప్రోత్సాహం తక్కువగా ఉందనే అభిప్రాయాన్ని వెలిబుచ్చిన ఆమె ప్రతి సంస్థలోనూ ఒక మహిళా డైరెక్టర్ ఉండాలని సూచించారు. మహిళలకు స్వేచ్ఛ ఇస్తే మంచి ఫలితాలు సాధిస్తారని, ఈ సదస్సు చాలా ముఖ్యమైనదని, మహిళలు ఎదుర్కొంటున్న సమస్యలపైనా చర్చించాల్సిన అవసరం ఉందన్నారు. మహిళలకు ప్రపంచంలో చాలా అవకాశాలు ఉన్నాయనే విషయం ఈ సదస్సు ద్వారా మరోసారి వెల్లడవుతుందని పేర్కొన్నారు.
అయితే బయట మాత్రం ఇవాంక రాక సందర్బంగా ఎక్కడ చూసినా ట్రాఫిక్ జాములే కనిపించాయి. ఈ ట్రాఫిక్ జామ్ విషయాన్ని తెలుపుతూ హీరో నవదీప్ ఓ ఫన్నీ ట్వీట్ పెట్టాడు. పవన్ కళ్యాణ్ కొత్తసినిమా ‘అజ్ఞాతవాసి’ లోని అనిరుద్ పాడిన ‘బయటకొచ్చి చూస్తే టైమేమో 3’o క్లాక్..’ పాటను పేరడీ చేసి ‘బయటకొచ్చి చూస్తే టైమేమో 10’o క్లాక్.. ఇంటికెళ్లే రోడ్డు మొత్తం ఇవాంకా రోడ్డు బ్లాక్..’ అని ట్వీట్ చేసాడు
Baitikelli chusthe time emo 10 o clock
Intikelle road mothham ivanka road block !! #haha 🙂— Navdeep (@pnavdeep26) November 28, 2017