ఒక నేత వార్తల్లో ఉండాలి అంటే ఏమి చేయాలి? ఒకప్పుడు అయితే ప్రజాసేవ చేయాలి మ్ ఇప్పుడు పార్టీ మారబోతున్నట్టు లీకు లు ఇవ్వాలి అంటూ తెలుగు రాష్ట్రాల లో జోకులు పేలుతున్నాయి.
సరే… అదలా ఉంచితే… తాజాగా అలాంటి పార్టీ మార్పుకు సంబంధించి రూమర్లు తెలంగాణ కాంగ్రెస్ ఎమ్మెల్యే సంపత్ కుమార్ గురించి వస్తున్నాయి. ఇదేమీ మరీ నిప్పు లేని పొగ అసలేం.
కొన్ని రోజుల క్రితం తమ పార్టీ అధిష్టానం నిర్ణయాలు బాగోలేవు అంటూ సంపత్ బహిరంగంగా నే అసంతృప్తి వ్యక్తం చేశారు. అప్పుడే ఆయన పార్టీ మార్పుల గురించి ఊహాగానాలు, మీడియా కధనాలు వెల్లువెత్తగా… ఆయన పెద్దగా పట్టించుకోలేదు.
ఇదిలా ఉంటే తాజాగా ఆయన టీ ఆర్ ఎస్ మంత్రి హరీష్ రావు ని కలిశారు. ఆంతరంగికoగా చర్చలు జరిపారు. దీనితో ఆయన పార్టీ మార్పు పై మళ్లీ గట్టిగా వినిపించింది. దాదాపుగా ఖరారు అయ్యింది అంటూ. అయితే ఈ పుకార్లను సంపత్ గురువారం ఖండించారు. తన నరనరాన కాంగ్రెస్ వుందని, తాను ప్రాణం ఉన్నంత వరకూ అదే పార్టీలో ఉంటా అన్నారు.
కేవలం కుట్ర పూరితంగానే ఇలాంటి పుకార్లు వ్యాప్తి చేస్తున్నారు అని ఆరోపించారు. తాను మళ్లీ, మళ్ళీ హరీష్ ను కలుస్తా అన్నారు. అయితే అది తన నియోజకవర్గ పరిధిలో సమస్యల గురించి మాత్రమే అన్నారు. టీ అర్ ఎస్ ను బొంద పెట్టే వరకు తాను పోరాటం చేస్తూనే ఉంటా అన్నారు…