వరుణ్ తేజ్ కథానాయకుడిగా శ్రీ వెంకటేశ్వర సినీ చిత్ర ఎల్ఎల్‌పి సంస్థ ఓ చిత్రాన్ని నిర్మిస్తోంది. రాశి ఖన్నా కథానాయిక నటిస్తుంది. వెంకీ అట్లూరి దర్శకుడు. బి.వి.ఎస్.ఎన్.ప్రసాద్ నిర్మాత. ఈ చిత్రానికి ‘తొలి ప్రేమ’ అనే టైటిల్ ఖరారు చేశారు. కొద్ది సేపటి క్రితం ఫస్ట్‌లుక్‌ని కూడా విడుదల చేశారు. ఇందులో రెండు రకాల గెటప్పుల్లో వరుణ్ దర్శనమిస్తున్నాడు. అందులో రెగ్యులర్ గెటప్ ఒకటైది, మరో దాంట్లో గెడ్డంతో అమర ప్రేమికుడిలా కనిపిస్తున్నాడు. ఫిబ్రవరి 9న విడుదల చేస్తున్నట్టు చిత్రబృందం ప్రకటించింది. డిసెంబరులో షూటింగ్ మొత్తం పూర్తవుతుంది. జనవరిలో పోస్ట్ ప్రొడక్షన్స్ పూర్తవుతాయి. ఫిబ్రవరిలో రాబోతోంది. ఫిదా తరవాత వరుణ్‌తేజ్ నుంచి వస్తున్న సినిమా ఇది. ఫిదా మ్యాజిక్‌ని తొలి ప్రేమలోనూ కొనసాగిస్తాడో లేదో చూడాలి. తమన్ సంగీతం అందిస్తున్న ఈ చిత్రానికి విలియమ్స్ ఫొటో గ్రఫీ సమకూర్చారు.