బాలీవుడ్ మరో దిగ్గజాన్ని కోల్పోయింది. కొద్ది సేపటి క్రితం అలనాటి బాలీవుడ్ కథానాయకుడు శశికపూర్ (79) కన్నుమూశారు. ముంబైలోని కోకిలాబెన్ ఆసుపత్రిలో తుదిశ్వాస విడిచారు. గత కొంతకాలంగా ఆయన అస్వస్థతతో బాధపడుతున్నారు. నెలరోజుల క్రితం ఆసుపత్రిలో చేరారు. వారం రోజులుగా ఆయన ఆరోగ్యం క్షీణ దశకు చేరుకొంది. 1940లోనే బాల నటుడిగా కెరీర్ ప్రారంభించిన శశికపూర్ దాదాపు వంద చిత్రాల్లో నటించారు. శశికపూర్ 2011లో పద్మభూషన్ అందుకున్నారు. ఈమధ్యే దాదాసాహెబ్ ఫాల్కే అవార్డు కూడా ఆయనను వరించింది. ఉత్తమ నటుడిగా మూడు సార్లు జాతీయ ఫిల్మ్ అవార్డులు అందుకున్నారు.