రాబోయే ఎన్నికల్లో తన పంథా ఏమిటో ఎలా ఉండబోతున్నదో… దాదాపుగా బయట పెట్టేసారు పవన్ కళ్యాణ్. మిగిలిన రాజకీయ నాయకులు పార్టీలు అన్నిటికన్నా మిన్నగా ఆయన వైసీపీ అధినేత మీదే ఎక్కువ విమర్శలు గుప్పించారు. విశాఖపట్నం లో తొలిగా మాట్లాడిన సమావేశంలో కాస్త పరోక్షంగా ఉన్నట్టు అనిపించిన విమర్శలు కాసేపు తర్వాత సమావేశంకు వచ్చేటప్పటికి ఫుల్ టర్న్ తీసుకుని నేరుగానే జగన్ కు గురిపెట్టాయ్.
డీసీఐ కి మద్దతుగా మాట్లాడినప్పుడు… ముఖ్యమంత్రి అయ్యాక ఏదో చేస్తామని చెప్పడం తనకు రాదని, కాబోయే సీఎం అని పిలిచే సరదా అభిమానులకు ఉన్నా అలాoటి సరదా తనకు మాత్రం లేదన్నారు. అయినా ఆపని అభిమానులను ఉద్దేశించి అందరూ చేసే తప్పు మనం చేయకూడదు అంటూ హితవు పలికారు… ఇలా పరోక్షంగా వైసీపీని, జగన్ ని విమర్శిస్తూ కొన్ని వ్యాఖ్యలు చేస్తూ ఆయన ప్రసంగం సాగిoది.
తర్వాత ఉత్తరాంధ్ర కార్యకర్తల సమావేశంలో మాట్లాడారు. అక్కడ మాత్రం నేరుగానే జగన్ పేరు ప్రస్తావించారు. తండ్రి చనిపోగానే సీఎం కావాలని కోరుకోవడం ఏమిటో తనకు అర్ధం కాలేదు అన్నారు. అది అవివేకం అని, నేతల కొడుకులు సీఎంలు కాకూడదని తాను అనడం లేదన్నారు. అయితే వారసులు అనేవారు నిరూపించుకుని మాత్రమే రావాలని అభిప్రాయ పడ్డారు. కొన్ని వేల, లక్షల కోట్లు దోచుకున్న వ్యక్తి రాష్ట్ర సీఎం అవడం అంటే అతన్ని చూసి జనం అంతా అలా యధారాజా తథా ప్రజా అన్నట్టు తయారవుతారు అనే భయంతోనే జగన్ కు వ్యతిరేకంగా, చంద్రబాబు కి మద్దతు ఇచ్చా అన్నారు. తనకు ముఖ్యమంత్రి కావాలని లేదు అని అందుకే పాదయాత్ర చేయబోనని… కానీ ప్రజల కోసం ఏ యాత్ర అయినా చేస్తా అన్నారు.
ఇలా…. పలు పవన్ తనకు జగన్ పట్ల ఉన్న వైఖరిని వెల్లడించారు. తనకు జగన్ అంటే వైరం లేదంటూనే స్పష్టంగా విపక్ష నేతను లక్ష్యంగా చేసుకున్న వైనం కనిపించింది. వారసులు ప్రతిభ అని పవన్ మాట్లాడుతూoడగా… సభికులు లోకేష్ సంగతి ఏమిటి అని ప్రశ్నించడం విశేషం. అయితే సీఎం చంద్రబాబు తన కొడుకు విషయంలో ఏదో ఎబిలిటీ చూసే ఉంటారని అందుకే మంత్రిని చేసి ఉంటారని పవన్ అనడం గమనార్హం.