పవన్ నిన్న కార్యకర్తల సమావేశం లో మాట్లాడుతూ శేఖర్ కమ్ముల పేరు ప్రత్యేకంగా ప్రస్తావించాడు. జనసేన ప్రారంభమైన్ కొత్తలో శేఖర్ కమ్ముల చేసిన ఒక ట్వీట్ ని దాదాపు మూడేళ్ళ తర్వాత ఇప్పుడు కూడా గుర్తుంచుకుని మరీ ప్రస్తావించడం ఆశ్చర్యం కలిగించింది. ఇంతకీ అసలు సంగతేంటంటే –
జనసేన ప్రారంభమైన కొత్తలో పవన్ పై ఎన్నో ఆశలు పెట్టుకున్న వారిలో ఒకరిగా స్పందించాడు శేఖర్ కమ్ముల. జనసేన ని స్వాగతించాడు. ఆయన పలు సందర్భాలలో తాను పవన్ ని అభిమానిస్తానని చెప్పాడు. ఇటీవల్ విడుదలైన ఫిదా సహా చాలా సినిమాల్లో ఏదో రకంగా పవన్ రెఫరెన్స్ చేయడం కూడా శేఖర్ కమ్ముల కి అలవాటే. అయితే 2014 లో జనసేన పోటీ చేయబోవడం లేదనీ, మోడీ కి మద్దతు పలుకుతానని పవన్ చెప్పాక, ఎంతో మంది అభిమానుల్లాగే నిరుత్సాహానికి లోనైన శేఖర్ కమ్ముల “మోడీ కి మద్దతు ఇవ్వండి అని అడగడానికి, ఇంత ఆవేశం, ఈ పార్టీ, ఇంత హంగామా అవసరమా ” అని ట్వీట్ చేసారు. అయితే ఇప్పుడు దాన్ని గుర్తుంచుకుని మరీ ప్రస్తావించిన పవన్, “శేఖర్ కమ్ముల లాంటివాళ్ళు కూడా నా మీద విమర్శలు చేశారు” అన్నారు. మోడీ ని ఆరోజు బలపరిచినందుకు నా మీద విమర్శలు చేసారే, మరి ఈ రోజు మోడీ ని కేవలం నేను మాత్రమే ప్రశ్నిస్తున్నా అన్నారు.
అయితే శేఖర్ కమ్ముల ట్వీట్ కూడా ఒక అభిమాని నిరుత్సాహ పడి మాట్లాడిన విధంగా ఉందే తప్ప పవన్ మీద కక్ష తోనో ద్వేషం తో నో చేయలేదు. అలాంటి ట్వీట్ ని పట్టుకుని , ఇంతకాలం గుర్తు పెట్టుకుని ప్రస్తావించాల్సిన అవసరం ఏమొచ్చిందో పవన్ కే తెలియాలి.