వైసీపీని లక్ష్యంగా చేసుకుని పవన్ చేసిన విమర్శలపై వైసీపీ ప్రతి విమర్శలు షురూ చేసింది. ఈ విషయం లో ముందుండే ఎమ్మెల్యే రోజా పవన్ కు కౌంటర్ ఇచ్చారు.
వారసత్వ పదవులను అంగీకరించనన్న పవన్ కామెంట్ ను ప్రస్తావిస్తూ… అలా అని చెప్పే హక్కు పవన్ కు లేదన్నారు రోజా. చిరంజీవి వారసుడిగానే కదా పవన్ హీరో అయ్యింది అని గుర్తు చేశారు. అసలు చిరంజీవి లేకపోతే పవన్ ఎక్కడ ఉండేవారు అంటూ ప్రశ్నించారు. గతంలో ప్రత్యేక హోదా గురించి ఏదేదో చెప్పిన పవన్ ఇప్పుడు ఎందుకు దాని గురించి మాట్లాడడం లేదో చెప్పాలన్నారు.
పనిలో పనిగా జబర్దస్త్ హీరోయిన్ లేక సభలో బోర్ కొడుతోంది అంటూ వ్యంగ్యంగా వ్యాఖ్యలు చేసిన తే దే పా నేత సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి తదితరులకు కూడా ఆమె కౌంటర్ ఇచ్చేసారు. తాను లేకపోయినా చంద్రబాబు, లోకేష్ లాంటి నంది అవార్డ్ విజేతలు ఉన్నారంటూ ఎద్దేవా చేశారు. ఇటీవలే తెదేపా లో చేరిన నటి వాణి విశ్వనాద్ పై పోటీకి తాను సిద్ధమేనని చెప్పారు.