ఇటీవల రామోజీ ఫిల్మ్ సిటీలో ‘ఇండివుడ్ ఫిల్మ్ ఫెస్టివల్’ జరిగింది. అసలు ఇండీవుడ్ ఏమిటో, ఈ గోలేమిటో… అనుకుని మిగిలిన పత్రికలు, మీడియా కామ్‌గా ఉన్నాయి. ‘ఈనాడు’ మాత్రం ఈ అవార్డు కార్యక్రమానికి ఓ రేంజులో పబ్లిసిటీ ఇచ్చింది. దాదాపుగా మూడొంతుల పేజీ ఇండీవుడ్కి ఇచ్చేసింది. ఎవ్వరికీ పట్టని ఈ కార్యక్రమానికి ఈనాడు ఎందుకింత హైప్ ఇచ్చిందో ఎవ్వరికీ అర్థం కాలేదు. బాహుబలి తరవాత.. ఓ ఈవెంట్ కి ఈస్థాయిలో ప్రచారం కల్పించడం చూసి మీడియా వర్గాలు షాక్ తిన్నాయి.
అయితే ఈ ప్రచార వ్యూహం వెనుక.. రామోజీ రావు తెలివితేటలు అపారంగా ఉన్నాయన్నది నిజం. ఇండీవుడ్ని నిర్వహిస్తున్న సోహాన్రాయ్తో రామోజీకి వ్యాపార సంబంధాలున్నాయని తెలుస్తోంది. ఇద్దరూ కలిసి త్వరలో ఓ భారీ ప్రాజెక్టుకి శ్రీకారం చుడుతున్నారని, దాని విలువ కొన్ని వేల కోట్లని సమాచారం. తెర ముందుండి నడిపించేది సోహాన్ రాయ్ అయినా, వెనుక ఉండి చక్రం తిప్పేది రామోజీనే అని టాక్. అందుకే ఈ స్థాయిలో సోహాన్రాయ్కి ప్రమోషన్ కల్పించింది ‘ఈనాడు’. అంతే కాదు.. ఈ కార్యక్రమానికి రామోజీ ఫిల్మ్‌సిటీ అడ్డాగా మారింది. అదేం ఫ్రీ కాదు. ఇదీ బిజినెస్ కోసమే. ఇండివుడ్ రూపేణా.. రామోజీ ఫిల్మ్‌సిటీకి రూ.2 కోట్ల వరకూ ఆదాయం వచ్చిందని తెలుస్తోంది. అదీ.. ఈ ఫ్రీ అనబడే పెయిడ్ పబ్లిసిటీ వెనుక ఉన్న రహస్యం.