హైదరాబాద్: తెలంగాణ రాష్ట్రానికి కేంద్రం ఏ విధమైన సాయం చేయటం లేదంటూ అధికార టీఆర్ఎస్ పార్టీ నేతలు తీవ్రంగా విమర్శలు చేస్తున్న సంగతి తెలిసిందే. అయితే కేంద్ర ప్రభుత్వం ఇవాళ తెలంగాణ రాష్ట్రానికి భారీస్థాయిలో సాయం ప్రకటించింది. కేంద్ర వ్యవసాయశాఖమంత్రి రాధా మోహన్ సింగ్ తెలంగాణకు రు.800 కోట్ల కరవు సాయం ఇస్తున్నట్లు ఇవాళ ప్రకటించారు. ఇంత మొత్తాన్ని గతంలో ఉమ్మడి రాష్ట్రం ఆంధ్రప్రదేశ్‌కు కూడా ఇవ్వలేదని కేంద్ర మంత్రి అన్నారు. అత్యున్నత స్థాయి కమిటీ నిర్ణయం ఆధారంగా ఈ మొత్తాన్ని మంజూరు చేస్తున్నట్లు ఒక ప్రకటనలో పేర్కొన్నారు. కేంద్రం ఈ మొత్తాన్ని సహజంగానే ఇచ్చిందా, లేక జీహెచ్ఎంసీ ఎన్నికల నేపథ్యంలో బీజేపీకి మద్దతు కూడగట్టేందుకు ఇచ్చిందా అనేది చూడాలి.