కత్తి మహేష్ – ఒక ఆర్నెల్ల క్రితం వరకు చాలా మందికి ఈయనెవరో కూడా తెలీదు. ఒక ఛానెల్ లో సినిమాలని రివ్యూ చేసే క్రిటిక్ గా కొంతమందికి మాత్రమే తెలుసు. అంతకు ముందు తెలుగు బ్లాగ్స్ లో కాస్త వివాదాస్పద కామెంట్లతో ఇతర బ్లాగర్ల తో వాదించే బ్లాగర్ గా ఇంకొంత మందికి తెలుసు. అయితే బిగ్ బాస్ తర్వాత రాష్ట్రమంతా పాపులర్ అయ్యాడు. ఆ షో లో పెద్దగా పేరు రాకపోయినా ఒక గుర్తింపు వచ్చింది. ఇక ఆ షో అయిపోయాక తనకంటూ ఒక గోల్ నిర్ణయించుకున్నాడేమో అనే విధంగా ఉద్దేశ్యపూర్వకంగా పవన్ కళ్యాణ్ పైనా జనసేన పైనా నిశితమైన విమర్శలు చేస్తూ, ఆయన ఫ్యాన్స్ కి కంటి మీద కునుకు లేకుండా చేస్తున్నాడు. సోషల్ మీడియా ని వేదిక గా చేసుకుని వరస కామెంట్లతో పవన్ కళ్యాణ్ ని విమర్శించడమే పనిగా పెట్టుకున్నాడా ఏంటి అనిపించేలా కామెంట్స్ చేస్తున్నాడు. అందులో కొన్ని, ఏదో ఒకరకంగా విమర్శించి తీరాలి అన్నట్టు తలాతోకా లేని లాజిక్కులు ఉన్నా కొన్ని మాత్రం సూటిగా తగిలేలా ఆలోచింపజేసేలా ఉన్నాయి. ఇటీవల ఆయన చేసిన కొన్ని కామెంట్స్ ఇవీ –
“అన్నను, పి.ఆర్.పి ని మోసం చేసినవాళ్ళ సంగతి సరే…మరి అన్న గారు జనానికి, కులానికి,పార్టీకి చేసిన మోసం సంగతో!!”
“నోరువిప్పిన ప్రతిసారీ అజ్ఞాతవాసి కాదు, అజ్ఞానవాసి అని తేలుతొంది. అంతే!”
“ఏడవడం తప్పుకాదు పవన్ కళ్యాణ్! చేతకాక, చెప్పుకోలేక ఏడవడటం తప్పు. ఆ విషయం ఇప్పుడు చెప్పి అల్లు అరవింద్ మీద పడి ఏడవడం అసలు తప్పు.”
అయితే కత్తి మహేష్ ఇంత ధైర్యంగా ఒక రాజకీయ పార్టీ మీద ఎక్కుపెట్టడానికీ, చీటికీ మాటికీ పెద్ద పెద్ద మీడియా ఛానెళ్ళలో స్పేస్ పొంది విమర్శలు చేయగలగడానికి కొంత మంది అండదండలు ఉన్నాయని తెలుస్తోంది. సినీ వర్గాల్లోనూ, కొన్ని రాజకీయ వర్గాల్లోనూ ఈ చర్చ ఇప్పుడు జోరుగా జరుగుతోంది. అభిఙ్ఞవర్గాల సమాచారం ప్రకారం – గతం లో పీఆర్పీ పెట్టినపుడు వ్యతిరేకించిన ఒక పెద్దాయన సపోర్ట్ సదరు క్రిటిక్ కి పుష్కలంగా ఉన్నట్టు తెలుస్తోంది. సినీ ఇండస్ట్రీ తోనూ సంబంధాలున్న ఆ పెద్దాయన అండ వల్లే క్రిటిక్ మహేష్ మరీ ధైర్యంగా ముందుకెళ్ళగలుగుతున్నాడని గుసగుసలు వినిపిస్తున్నాయి. అయితే ఆ పెద్దాయన వెనకాల ఎవరున్నారన్నది మహేష్ కి తెలుసో తెలీదొ చెప్పలేం. కానీ చూస్తున్న ప్రజలకి మాత్రం ఇవాళ రేపు అన్నీ చాలా క్లియర్ గా అర్థమవుతున్నాయి. ఏ వ్యాఖ్య ఎవరికి, ఏ పార్టీ కి లాభం కలిగేలా డిజైన్ చేయబడిందనే విషయాన్ని సాదా సీదా ఆటోవాలా లాంటి కామన్ మేన్ కూడా ఛానెల్ ముందు కూర్చున్న విశ్లేషకులకి దీటుగా అనలైజ్ చేయడం చూస్తొంటే ఆశ్చర్యం వేస్తోంది. ఆ లెక్కన కత్తి మహేష్ ఏ పార్టీ కి లాభం చేకూర్చడానికి తపిస్తున్నాడో ఇట్టే అర్థమవుతోంది చూస్తున్న ప్రేక్షకులకి.
సోషల్ మీడియా విస్తృతి పెరిగాక ఒక పదేళ్ళ క్రితం లాగా ఒక పత్రిక లో నో ఒక ఛానెల్ లోనో వచ్చినంత మాత్రాన ప్రజలందరూ ఒక వార్తని గానీ విశ్లేషణని గానీ 100% నిజం అని నమ్మే పరిస్థితి కూడా లేదు. అలాంటిది కేవలం కత్తి మహేష్ లాంటి ఒక క్రిటిక్ – తాను వ్యాఖ్యలు చేసినంత మాత్రాన ప్రజలంతా నమ్మేస్తారని అనుకోవడం పొరపాటు, అలాగే – అలా ప్రజలు ఎక్కడ నమ్ముతారో అని పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ ఆందొళణకి గురై కత్తి విషయమై గింజుకోవడం కూడ అంతే పొరపాటు!!!