ఆత్మహత్యకు పాల్పడిన టాలీవుడ్ కమెడియన్ విజయ్ కధ మీడియా చానెళ్లకు ఇప్పుడు బోలెడంత సరంజామా అందిస్తోంది.. విజయ్ – వనిత ల కాపురం నిండా రకరకాల విబేధాలు ఉండడంతో పాటు ఇద్దరూ సినీ పరిశ్రమకు చెందిన వారు కావడం కూడా మీడియా హడావిడికి హద్దే లేకుండా చేస్తోంది. అందుకు తగ్గట్టే పూటకొకటి చొప్పున రకరకాల ట్విస్టులు వెలుగు చూస్తూండడంతో మీడియా పండగ చేసుకుంటోంది.
ఆత్మహత్య చేసుకున్న విజయ్ సెల్ఫీ వీడియోలో భార్య, ఆమె తరపు న్యాయవాది, ఆమె సన్నిహితులపై ఆరోపణలు చేసిన సంగతి తెలిసిందే. ఆ వీడియోలో తన భార్య వ్యభిచారి అని కూడా విజయ్ నిందించాడు. అత్తగారు సైతం వ్యభిచారం నిర్వహిస్తుందన్న విజయ్… అటువంటి పరిస్థితులలో తన కూతురు పెరగకూడదని కోరుకుంటున్నానన్నాడు. ఆ వీడియోలో ఎన్ని ఆరోపణలున్నా… అన్నింటికన్నా ఇది ఆయన భార్య వనితారెడ్డిని తీవ్రంగా ఇబ్బంది పెట్టే ఆరోపణ అనడంలో సందేహం లేదు. .
ఈ నేపధ్యంలోనే ఆత్మహత్య వార్త తెలుసుకుని విజయ్ మృతదేహాన్ని చూడడానికి వచ్చినప్పుడు అతని పట్ల కాస్త మంచిగానే మాట్లాడిన వనిత… నిదానంగా స్వరం మార్చింది. .వ్యభిచారం ఆరోపణలకు మీడియాలో ప్రాధాన్యం దక్కడంతో ఆమె మరింత కటువుగా మారినట్టు కనిపిస్తోంది. దీంతో ఆమె విజయ్‌పై వరుసపెట్టి ఆరోపణలు గుప్పిస్తూ వచ్చారు. దీనికి పరాకాష్టగా అన్నట్టు, సెల్ఫీ వీడియోకి బదులుగా అన్నట్టు ఆమె ఒక ఆడియో రికార్డింగ్ బయట పెట్టారు.
వనిత చెపుతున్న ప్రకారం… దీనిలో విజయ్ ఆయన తండ్రితో జరిపిన సంభాషణ ఉంది. వీరిద్దరి మాటలను బట్టి విజయ్‌కు హెచ్ఐవి సోకిందని తెలుస్తోంది. అయితే ఈ ఆడియో రికార్డింగ్‌ను విజయ్ తండ్రి ఖండించారు.. .అందులో ఉన్న సంభాషణ తమది కాదంటున్నారాయన. ఏదేమైనా… మంగళవారం విజయ్ మృతదేహానికి ఉస్మానియా ఆసుపత్రిలో పోస్ట్‌మార్టం నిర్వహించనున్నారు. ఈ నేపధ్యంలో తాజాగా వనిత చేస్తున్న ఆరోపణను కూడా పోలీసులు పరిగణనలోకి తీసుకునే అవకాశం ఉంది. మరోవైపు విజయ్ మృతికి కారణమయ్యారంటూ భార్య వనిత సహా విజయ్ సెల్పీ వీడియోలో పేర్కొన్న ప్రతి ఒక్కరిపైనా పోలీసులు కేసులు నమోదు చేశారు.
ఏదేమైనా… ఇలాంటి విషయాల్లో నిజానిజాలు తేలకముందే ఆడియో,, వీడియోలలోని వివరాలను పదే పదే బయటపెట్టడం ద్వారా మీడియా మృతులు బంధువులకు మరింత అశాంతిని కలగజేస్తోందనేది నిజం.