ఎపి లో రేషన్ షాపులన్నీచంద్రన్న మాల్స్ గా మార్చుతున్నట్లు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఇదివరకే ప్రకటించారు.రిలయన్స్ ,ప్యూచర్ గ్రూప్ లు నిర్వహించే ఈ మాల్స్ లో అన్ని రకాల వస్తువులు తక్కువ దరకు పేదలకు అందుబాటులో ఉంటాయని వాటిని ప్రారంభించిన సందర్భంగా చంద్రబాబు చెప్పారు.
అయితే ఇప్పుడు దీనిపై వైసిపి విమర్శల వేడి పెంచింది. చంద్రన్న మాల్స్ పేరుతో ప్రజలను మోసం చేసే ప్రయత్నం జరుగుతోందని వైఎస్ ఆర్ కాంగ్రెస్ ఒక ప్రకటన విడుదల చేసింది. గ్రామాల్లోని చిన్న వ్యాపారుల లాభాన్ని హెరిటేజ్‌కు మళ్లించేందుకు సీఎం చంద్రబాబు ప్రయత్నిస్తున్నాడని ఆరోపించింది. గ్రామల్లోని చిన్న దుకాణాలు, బడ్డీకొట్టుల నిర్వహాకులకు వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ అండగా ఉంటుందని తెలిపింది.
ఇక ఎమ్మెల్యే రోజా తనదైన శైలిలో సెటైర్లు వేశారు. ఏపీ లో ప్రస్తుతం 21 పథకాలకు చంద్రబాబు పేరే పెట్టారని బ్రతికి ఉండగానే ఎవరైనా వారి పేరు పథకాలకు పెట్టుకుంటారా ? అని ఆమె ప్రశ్నించారు. అయితే రోజా వాదనలో ఏ మత్రం పస లేదని టిడిపి వర్గాలు అంటున్నాయి. జయలలిత మొదలు మాయావతి వరకు ఎంతో మంది తమ ప్రభుత్వ పథకాలకు తమ పేర్లు పెట్టుకున్నారు. “అమ్మ” పేరుతో జయలలిత పెట్టిన ఎన్నో పథకాలకి తమిళ నాడులో విపరీతమైన ఆదరణ లభించిన విషయం ఆ రాష్ట్రానికి పొరుగునే ఉన్న చిత్తూరులో ఉన్న రోజాకి తెలియకపోవడం ఆశ్చర్యమే!