మెంటల్ మదిలో సినిమాతో ఆకట్టుకున్నయువ దర్శకుడు వివేక్ ఆత్రేయ. అతనికి సురేష్ ప్రొడక్షన్స్ మరో చాన్సిచ్చింది. సురేష్ బాబు, రాజ్ కందుకూరి ఈ చిత్రానికి నిర్మాతలుగా వ్యవహరిస్తారు. ఈసారి వివేక్ ఓ థ్రిల్లర్ సినిమాని రూపొందించనున్నాడు. ఈ చిత్రానికి టైటిల్ కూడా పిక్సయ్యింది. అదేంటో తెలుసా?? ‘బ్రోచేవారెవరురా’. కథ ఓకే అయిపోయింది. ప్రస్తుతం నటీనటుల కోసం అన్వేషణ జరుగుతోంది. ఓ యువ కథానాయకుడు ఈ సినిమాలో నటిస్తారని సమాచారం. 2018 ఫిబ్రవరిలో ఈ సినిమా సెట్స్‌పైకి వెళ్తుంది. రూ.కోటి తో తీసిన `మెంటల్ మదిలో` బాక్సాఫీసు దగ్గర ఆర్థిక పరమైన లాభాల్ని అందుకోవడమే కాదు, విమర్శకుల ప్రశంసలు కూడా సంపాదించింది. ఈసారీ.. చిన్న బడ్జెట్‌తోనే ఈ సినిమాని రూపొందిస్తారని సమాచారం. `బ్రోచేవారెవరురా`కి సంబంధించిన పూర్తి వివరాలు త్వరలో వెల్లడవుతాయి.