ఇటీవల నిర్మాత బండ్లగణేశ్, వైసీపీ ఎంఎల్ఎ రోజాల మధ్య సాగిన చవకబారు వాదనలు మీడియాలోనూ సోషల్ మీడియాలోనూ కూడా తీవ్ర విమర్శలకు దారితీస్తున్నాయి. అగ్రశ్రేణిలో వున్న ఛానల్ ఆదర్శంగా వుండాల్సింది పోయి ఇలాటి పోకడలను ప్రోత్సహించడం అందరూ గమనిస్తున్నారు. ఏది వైరల్ ఏది రియల్ అని సందేహం కలుగుతున్నది.రాజకీయేతర అంశాలతో ఆకర్షణ పెంచుకోవాలనే వ్యూహంలో భాగంగా చూస్తున్నారు. నేను పాల్గొన్న ఒక చర్చలో ఎపి24/7 వెంకటకృష్ణ తీవ్రంగానే ఈ విషయం లేవనెత్తగా అందరూ ఖండించారు. ఆచర్చ బాగా ఆదరణ పొందడం కూడా ప్రజల భావాలకు నిదర్శనంగా చెప్పొచ్చు. సవాలక్ష సమస్యలు వెన్నాడుతుంటే కావాలని కొన్ని వ్యర్థ వివాదాలు రగిలించడం హీనంగా మాట్లాడుతున్నా అవకాశమిచ్చి దాన్నే ఆకర్షణగా మార్చుకోవడం తప్పుకాదా అని మాలాటి వారిని అడుగుతున్నారు. సోషల్ మీడియా సాకుతో అనామకులూ
అవగాహన లేని వారి పోస్టులపై వ్యాఖ్యలపై రోజుల తరబడి వివాదాలు నడపడం సరికాదు. పవన్ జగన్ లేదా చంద్రబాబు ఎవరి అభిమానులైనా సరే ఇతరులపై నోరు పారేసుకోవడం, బెదిరింపులకు దిగడం సమర్థనీయం కాదు. ఎవరు ఏమిటో తెలిసి కూడా అతిగా మాట్లాడించి రేటింగులకు వాడుకోవడం అంతకన్నాదారుణం. విమర్శకుడు కత్తిమహేష్పై దాడులు ఆయన వ్యాఖ్యలు మరో వివాదంగా వున్నాయి.