తారల జీవితాలు పైపై మెరుగులే. లోపల చీకటి కోణాలు చాలా ఉంటాయి. కొంతమంది కథానాయికలు… వేషాలు దొరక్క, దొరికినా వాటితో సంతృప్తి పడక, అడ్డదారులు వెదుక్కుంటుంటారు. చివరికి ఆ చీకటి కోణాలు వెలుగులోకి వచ్చేసరికి తెల్లమొహం వేయాల్సివస్తుంది. అలాంటి మరో ఉదంతం వెలుగులోకి వచ్చింది. ఓ కథానాయిక.. హైదరాబాద్లోని స్టార్ హోటెల్లో వ్యభిచారం చేస్తూ అడ్డంగా దొరికిపోయింది. శనివారం సాయింత్రం హైదరాబాద్లోని తాజ్ దక్కెన్ హోటెల్ మీద పోలీసులు రైడ్ చేశారు. ఆ సమయంలో రీచా సక్సేనా (25) అనే ఓ నటి వ్యభిచారం చేస్తూ దొరికిపోయింది. ముంబైకి చెందిన రిచా… అక్కడ కొన్ని బుల్లి తెర కార్యక్రమాల్లో నటించింది. జూన్ 1:43 (Trailer Here) అనే చిత్రంలో ఈమె కథానాయికగా నటించింది. ఈ సినిమా ఇంకా విడుదల కాలేదు. ఆమెతో పాటు వ్యభిచారం చేయిస్తున్న మరో వ్యక్తిని కూడా అరెస్టు చేశారు. పంజాగుట్ట పోలీస్ స్టేషన్లో కేసు నమోదైంది.