తెలంగాణ ముఖ్యమంత్రి కెసిఆర్‌కూ ఎపి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకూ మధ్య కనిపించని శత్రుత్వుం వుందన్నారు సీనియర్ ఎడిటర్ ఐ.వెంకట్రావు. అసలు ఆయనైతేనే కెసిఆర్‌కు సరైన శత్రువు అన్న అభిప్రాయమే ఎన్నికల్లో చంద్రబాబును ఎన్నుకోవడానికి ప్రధాన కారణం అన్నది ఆయన విశ్లేషణ. తామంతా వైసీపీ నేత జగన్ ముఖ్యమంత్రి అయ్యాడనే అనుకున్నామనీ, అయితే చంద్రబాబు అనుభవానికి తోడు ఈ అంశం ప్రధానంగా గెలిపించిందని నాతో ఒక ఇంటర్వ్యూలో చెప్పారు. ఇప్పుడు ఇద్దరు ముఖ్యమంత్రులకు వైరం తగ్గింది కదా అంటే కనిపించని శత్రుత్వం వుందన్నారు. టిడిపి టిఆర్ఎస్లు ఒకే విధంగా పెరిగిన ప్రాంతీయ పార్టీలు గనక వాటిమధ్య సఖ్యత సాధ్యం కాదన్నది ఆయన విశ్లేషణ. తెలంగాణలో టిడిపికి తనదైన పునాది వుందని అది పూర్తిగా అదృశ్యమై పోతుందనే కథనాలు నిజం కాకపోవచ్చని ఐవిఆర్ చెబుతున్నారు. మరి వాస్తవంలో ఏం జరుగుతుందో చూడాలి.