నంద్యాల ఉప ఎన్నిక ఎపి రాజకీయాలలో ఎలాటి ప్రకంపనాలు సృష్టించిందో అందరూ చూశారు. అక్కడ ఘన విజయం ఆ తర్వాత కాకినాడ ఫలితం టిడిపికి పెద్ద ఉత్సామమిచ్చాయి. భూమా అఖిల ప్రియ మంత్రిగా వుండటంతో నంద్యాలపై తెలుగుదేశం కేంద్రీకరణ కూడా పెరిగింది. డబ్బులు గుమ్మరించడం అదికార దుర్వినియోగం వంటి అరోపణలు ఎన్ని వున్నా ఇప్పుడు నంద్యాల మోడల్ అనే మాట ఎక్కువగా వినిపిస్తున్నది. తమాషా ఏమంటే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కూడా ఈసారి అక్కడి నుంచి పోటీ చేస్తారని స్థానిక పత్రికలు కథనాలు ఇస్తున్నాయి. వివిఐపి నియోజవర్గం అన్న ప్రచారంతో నంద్యాలలో స్థలాల రేట్లు వేగంగా పెరిగిపోతున్నాయట. చాలా ఏళ్ల తర్వాత ఈ పెరుగుదలకు స్థానికులు సంతోషిస్తున్నారు. అయితే స్వంత జిల్లాలో భద్రంగా కాపాడుకుంటున్న కుప్పంను వదిలి ఇక్కడికి ఎందుకు వస్తారన్నది అర్థం కాని ప్రశ్న. లేక రియల్ వ్యాపారులే కావాలని వదంతులు వ్యాప్తిలో పెడుతున్నారా? తెలియదు. టిడిపి నాయకత్వమే దీనిపై ఒక స్పస్టత ఇస్తే సరిపోతుంది.