‘అపరిచితుడు’ లాంటి సినిమాతో టాలీవుడ్‌ని షేక్ చేసేశాడు విక్రమ్. అతని ‘ఐ’ కూడా విడుదలకు ముందు చాలా సంచలనాలు సృష్టించింది. ఫలితం ఎలాగున్నా ‘ఐ’ ఓపెనింగ్స్ అదిరిపోయాయి. కానీ అపరిచితుడు తరవాత ఆ స్థాయి సినిమా చేయలేకపోయాడు విక్రమ్. అతనెన్ని ప్రయోగాలు చేసినా… ఫలితం రావడం లేదు. దాంతో క్రమంగా తన తెలుగు మార్కెట్ కూడా తగ్గుతూ వచ్చింది. సమంతతో కలసి చేసిన ’10’ కూడా తెలుగులో ఎప్పటికో వచ్చింది. వచ్చినా… వసూళ్లు దక్కించుకోవడంలో విఫలం అవుతోంది.
విక్రమ్ తాజా చిత్రం ‘స్కెచ్’ జనవరిలో విడుదలకు సిద్దం అవుతోంది. ఈ సినిమాకి సంబంధించి ఓ ఆసక్తికరమైన విషయం బయటకు వచ్చింది. తెలుగులో ఈ రైట్స్ కోసం వెళితే.. రూ.10 కోట్ల వరకూ చెబుతున్నార్ట. దాంతో తెలుగు నిర్మాతలు షాక్ అయిపోతున్నారు. విక్రమ్‌కి ఇంత మార్కెట్ ఉందా?? అంటూ ఆశ్చర్యపోతున్నారు. ‘స్కెచ్’పై తమిళ నిర్మాతలకు విపరీతమైన నమ్మకం ఉందని, అందుకే ఈ స్థాయిలో రేట్లు చెబుతున్నారని తెలుస్తోంది. విక్రమ్ సినిమా తెలుగులోనూ హిట్టయితే.. యావరేజ్‌గా రూ.10 కోట్లు సంపాదించుకోవచ్చు. ఆ లెక్కలు వేసుకునే స్కెచ్‌కి ఇంత రేట్ చెబుతున్నారని సమాచారం. విక్రమ్ ‘స్వామి 2′ కూడా నిర్మాతల్ని భయపెట్టేస్తోంది. దానికైతే రూ.14 కోట్లు అడుగుతున్నార్ట. ’10’ డబ్బింగ్ రైట్స్ రూ.1.5 కోట్లకు అమ్ముడుపోతే.. ఈ రెండు సినిమాలూ ఈ స్థాయిలో ఎందుకు చెబుతున్నారో మనవాళ్లకు అర్థం కావడం లేదు.