నాగార్జున – చిరంజీవిలది ఆత్మీయ అనుబంధం. ఫిల్మ్ ఇండ్రస్ట్రీలో నాగ్.. క్లోజ్‌గా ఉండేది చిరుతోనే. ‘మా’ టీవీలో ఒకప్పుడు ఇద్దరూ పార్ట్నర్స్ కూడా. ఇప్పటికీ అదే స్నేహం కొనసాగుతోంది. తాజాగా ‘హలో’ సినిమా ప్రమోషన్స్ లోనూ చిరు ఓ చేయి వేయబోతున్నాడు.
అఖిల్ హీరోగా, విక్రమ్ కె. కుమార్ దర్శకత్వంలో అక్కినేని నాగార్జున నిర్మించిన చిత్రం ‘హలోస. ఈనెల 22న విడుదల కాబోతోంది అవుతుంది. ప్రమోషన్లు కూడా జోరుగా సాగుతున్నాయి. విశాఖ పట్నంలో ఆడియో విడుదల చేశారు. ఈమధ్యే అఖిల్ అమెరికాలో ప్రమోషన్లని పూర్తి చేసుకొచ్చాడు. ఈనెల 20న స్పెషల్ ప్రమోషనల్ షోను హైదరాబాద్‌లో నిర్వహించనున్నారు. ఈ కార్యక్రమానికి చిరంజీవి ముఖ్యఅతిథిగా హాజరవుతారు. చిరు వచ్చాడంటే మెగా ఫ్యాన్స్ అండ కూడా ఈ సినిమాకి దొరికినట్టే.