‘నాకు ఇష్టమైన స్నేహితుడు,
నా సునామీ, నా ఉప్పెన,
నేను దాచుకున్న సైన్యం,
నేను శత్రువు మీద చేసే యుద్ధం,
నేను ఎక్కు పెట్టిన బాణం,
నా పిడికిట్లో ఉన్న వజ్రాయుధం,
నా ఆశల ఆకాశంలో ఉన్న పిడుగు,
ఎంతో మంది గుండెలు తడపడానికి వచ్చే ఒక వర్షపు చినుకు,
స్నేహరుతు పవనం
వింటారా వెనకాలే వస్తారా…
తోడుగా ఉందాం వస్తారా..రండి విందాం..
వున్నఫలంగా ఈ మాటలు తూటాలు ఏమిటని అనుకుంటున్నారా ? ఇదంతా అజ్ఞాతవాసి ఆడియో ఈవెంట్ ఫీవర్. అవును.. పవన్ కళ్యాణ్ సినిమా వేడుక అంటే ఇలానే ఉటుంది పొగడ్తల వర్షం. అందులోనూ ఇది త్రివిక్రమ్ సినిమా. ఇక ఆ మాటల మంత్రం ఒక రేంజ్ లో ఉటుంది. పవన్ కళ్యాణ్ వేడుక అంటే ‘పవనాష్టకం’ అదిరిపోతుంది. మాట్లాడే ప్రతి వ్యక్తి ఒక పెద్ద రైటర్ అయిపోతాడు. ఇంకొందరు అయితే ఏకంగా బట్రాజుమేళం మొదలెట్టేస్తారు. మరి కొందరు ‘పవన్ కళ్యాణ్ తోపు- దమ్ముంటే ఆపు’అంటూ స్టేజులు మీద నుండే వార్నింగులు అవీ పాస్ చేస్తుంటారు.
అయితే వీరిలో త్రివిక్రమ్ మాటలు కేక. ఆయన పెద్ద స్టార్ రైటర్. పవర్ స్టార్ గొప్పదనం తన రైటింగ్ స్కిల్స్ తో మరింత పెంచేస్తుంటారు. అందుకే త్రివిక్రమ్ ఎక్కడ మైక్ పట్టుకున్నా పవన్ కళ్యాణ్ ని పొగడండి ప్లీజ్ అని అభిమానులు అల్లరి చేసేస్తుంటారు. పైన రాసిన మాటలు ఓ సందర్భంలో ఆయన నుండి వచ్చినే. తనకే సాధ్యమయ్యే బరువైన మాటలతో పవన్ ని ఆకాశానికి ఎత్తేశాస్తారు త్రివిక్రమ్. ఇప్పుడు అజ్ఞాతవాసి ఆడియో లో కూడా త్రివిక్రమ్ మాటల కోసం ఫ్యాన్స్ వెయిటింగ్. ఈసారి మాటల మాంత్రికుడు.. ఎలాంటి మాటలతో అభిమానులను మెస్మరైజ్ చేస్తారో..