ప్రజలను ఆకట్టుకోవడానికి కొత్త వాగ్దానాల గురించి ఆలోచిస్తున్న ఎపి ప్రతిపక్ష నేత జగన్ మద్య నిషేదం గురించి మాట్లాడారు. 1994లో ఎన్టీఆర్ను గద్దెక్కించిన వాగ్డానం ఇదేనన్నది తెలిసిందే.అనంతపురం జిల్లాలో తనకంటివారిపల్లె వరకూ జరిగిన పాదయాత్రలో ఆయన ఈ మాట చెప్పారు. తాము అధికారంలోకి వస్తే దశలవారిగా మద్యాన్ని నిషేదిస్తామని ప్రకటించారు. రైతుల సమస్యలు రుణమాఫీ, డ్వాక్రా మహిళలు తదితర అంశాలు మాట్లాడాక మద్యం రక్కసి గురించి ప్రస్తావించారు. దాని వల్ల కుటుంబాలే నాశనమవుతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. అందుకే దీన్ని దశల వారిగా నిషేదిస్తామని మహిళలకు హామీ నిచ్చారట. మరి ఇది మరోసారి రాజకీయ నినాదం కాబోతుందేమో చూడాలి.