ముకుందా, కంచె లాంటి ఫీల్ గుడ్ సినిమాలతో ప్రయాణం మొదలెట్టాడు వరుణ్‌తేజ్. లోఫర్ చేసి తన మాసిజం చూపించాలన్న ప్రయత్నం బెడసి కొట్టింది. ఫిదాతో మళ్లీ ట్రాక్ ఎక్కాడు. ఒక విధంగా అదీ ఫీల్ గుడ్ లవ్ స్టోరీనే. ఇప్పుడు తొలి ప్రేమ కూడా అలాంటి సినిమానే కనిపిస్తోంది. వెంకీ అట్లూరి దర్శకత్వం వహించిన ఈ సినిమాకి బీవీఎస్ఎన్ ప్రసాద్ నిర్మాత. టీజర్ కొద్ది సేపటి క్రితం విడుదలైంది. ”మన లైఫ్ లోకి ఎంతమంది అమ్మాయిలు వచ్చినా ఫస్ట్ లవ్ మాత్రం ఎప్పటికీ మర్చిపోలేం..” అంటూ వరుణ్ చెప్పిన డైలాగ్‌తో టీజర్ కట్ చేశారు. ”తొలి ప్రేమా నా గుండెకి గాయమా” అనే ఆలాపన వినిపించింది. ఈ డైలాగ్ కంటే, వరుణ్ లుక్ కంటే, తమన్ ఇచ్చిన ఆర్.ఆర్ ఆకట్టుకొంది. తమన్ సౌండింగ్ ఈమధ్య కాస్త మారినట్టే అనిపిస్తోంది. బీటుతో బాదకుండా.. ట్యూన్‌పై శ్రద్ద పెడుతున్నాడు. తొలి ప్రేమలో మరిన్ని మెలోడీ పాటలు వినిపించే అవకాశం దక్కిందేమో! మొత్తానికి మరో ఫీల్ గుడ్ మూవీ చూడబోతున్నాం.. నేను చూపిస్తా.. అన్నట్టు భరోసా ఇచ్చాడు వరుణ్.