హలో హిట్టు కళ అప్పుడే నాగ్ మొహంలో కనిపిస్తోంది. ఈ సినిమాపై ముందు నుంచీ నమ్మకంతోనే ఉన్నాడు నాగ్. హలో ప్రీ రిలీజ్ ఫంక్షన్లోనూ అదే కాన్ఫిడెన్స్ కనిపించింది. ‘కొడితే సిక్స్ కొట్టాలి’ అంటూ… ఈ సినిమా గురించి ఒక్క మాటలో తేల్చేశాడు. హలో ప్రీ రిలీజ్ ఫంక్షన్లో నాగ్ ఏమన్నాడో క్లుప్తంగా…
”ఈ రోజు చాలా తృప్తిగా, ఆనందంగా ఉంది. ఈ సినిమాకి హీరో విక్రమ్ కుమారే. మాకుటుంబం అతనికి రుణపడి ఉంది. మనంలాంటి సినిమా ఇచ్చినందుకు కృతజ్ఞతలు. ఇప్పుడు హలోతో చక్కటి సినిమా ఇచ్చాడు. అందుకు మరోసారి థ్యాంక్స్.
చిరంజీవి గారి ఇంటికి వెళ్లి.. `మీరొచ్చి.. అఖిల్‌ని ఆశీర్వదించాలి` అన్నా. `ఎక్కడి రావాలో చెప్పండి.. అక్కడి వస్తా` అన్నారు. `సినిమా చూశాక.. రండి… చూశాకే మాట్లాడండి` అన్నాను. పొద్దుటే సినిమా చూశారు. ఇప్పుడు ఈ ఫంక్షన్‌కి వచ్చారు. చిరు ఆశీర్వాదాలు ఎప్పుడూ మాకున్నాయి. చిరంజీవి గారు నాకంటే పెద్ద. మా ఇద్దరి మనసులు, పద్ధతులు, మనసులు కుదిరాయి. చరణ్, అఖిల్ ఎప్పుడు ఫ్రెండ్సయ్యారో, అఖిల్ చరణ్‌ని ఎప్పుడు పెద్దన్నయ్య అని పిలవడం మొదలెట్టారో తెలీదు. కానీ అలా పిలుస్తుంటే బాగుంది. మా ఇంటికి కొత్త కోడలు వచ్చింది. ఎప్పుడూ కళకళలాడుతూ ఉంటుంది. చైతన్యకు ఉన్నంత మంచి మనసు నాకు లేదు. ఎవరికీ లేదు. అఖిల్‌ని చూస్తుంటే కడుపు నిండుతుంది. తను డాన్స్ చేస్తుంటే… పాట పాడుతుంటే హాయిగా ఉంటుంది” అన్నాడు నాగ్.