విక్రమ్ కుమార్ దర్శకత్వంలో అక్కినేని అఖిల్ నటించిన ‘హలో’ ప్రీరిలీజ్ వేడుక హైదరాబాద్‌లోని ఎన్కన్వెన్షన్ సెంటర్లో అభిమానుల కోలాహలం మధ్య జరిగింది. చిరంజీవి, చరణ్ ఈ ఫంక్షన్ కి ముఖ్య అతిథులుగా హాజరయ్యారు.
అఖిల్ మాట్లాడుతూ చిరంజీవి మా పెదనాన్న చరణ్ నాకు అన్నయ్య అంటూ మొదలుపెట్టారు. ఇక, అఖిల్ ఈ సినిమా కోసం ఎంత చేయాలో అంతా చేస్తున్నాడు. స్టేజీపైన అఖిల్ పాట పాడడమే కాకుండా డ్యాన్స్ కూడా చేశాడు. అయితే పాట మొదలు పెట్టేముందు చిరంజీవిని ఉద్దేశించి, “చిరంజీవిగారూ! మిమ్మల్ని చూడగానే ఫ్రీజ్ ఐపోయాను పాడడానికి కాస్త సమయం కావాలి” అన్నాడు. అయితే పాడటానికి తాను సిద్ధమయ్యాక కూడా ల్యాప్ టాప్ కాసేపు టెక్నికల్ ప్రాబ్లం ఇచ్చింది. దానికి అఖిల్, “చిరంజీవి గారిని చూసి ల్యాప్ టాప్ కూడా ఫ్రీజ్ అయినట్టుంది” అని చమత్కరించాడు.
వేడుకలో భాగంగా చిరంజీవి మాట్లాడుతూ..”హలో ఐడియా ఎవరిదో కానీ నిజంగా హ్యాట్సాఫ్. ఈ రోజుల్లో హలో అనేపదం అందరి నోళ్ళలో నాని పోతోంది. అలాంటి పదాన్ని టైటిల్ గా పెట్టడం నిజంగా గ్రేట్. వినయంలో, సంస్కారంలో అఖిల్ బంగారం . అలాంటి బంగారాన్ని కన్నందుకు గాను అమలను, నాగార్జునను అభినందించాలి” అన్నారు చిరు. విడుదలకు ముందే ‘హలో’ సినిమా చూసి చాలా ఎమోషన్‌కి లోనయ్యానని అన్నారు. క్లాస్, మాస్ అందరినీ ఆకట్టుకుంటూ ఈ సినిమా ఆల్ క్లాస్ సినిమా అవుతుందని చెప్పారు.