ఈ రోజు వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి పుట్టిన రోజు. పొద్దుటి నుంచి ఆయన పార్టీ శ్రేణులు సహజంగా నే బోలెడు హడావుడి చేస్తున్నాయి. అయితే ఎన్నో శుభాకాంక్షలు అందుకున్నా… జగన్ కు ఆశ్చర్యం తో కూడిన ఆనందాన్ని ఇచ్చిన గ్రీటింగ్స్ ఎవరివో తెలుసా? ఆయన ఎవరిని కుర్చీ నుంచి దింపేయాలని తహతహ లాడుతున్నారో.. ఆ చంద్రబాబు నుంచే.
అవును… చంద్రబాబు విపక్ష నేతకు ట్విట్టర్ ద్వారా పుట్టినరోజు శుభాకాంక్షలు చెప్పారు. జగన్ కు దేవుడు మంచి చేయాలని కూడా ఆకాంక్షించారు. దీనికి జగన్ ఆనందాశ్చర్యాలు వెలిబుచ్చారు. కృతజ్ఞతలు తెలిపారు.
నిజానికి ఇంకెవరి విషయం లో నైనా ఇదో పెద్ద వార్త కాదు. కానీ టీడీపీ అధికారంలోకి వచ్చిన దగ్గర నుంచి అధికార విపక్ష పార్టీల నేతల తీరు పరిశీలిస్థూ వచ్చిన వారికి మాత్రం గొప్ప విశేషమే. ఎన్నో సందర్భాల్లో ఎదురెదురు పడినా కనీసం మర్యాద పూర్వక షేక్ హ్యాండ్ గాని నమస్కారాలు గాని చేసుకొని అధినేతల మధ్య ఈ ఆకస్మిక శుభాకాంక్షలు… కృతజ్ఞతల పర్వం అందరినీ ఆశ్చర్యానికి గురిచేసింది.
ఏదేమైనా… ఇదే రోజు 2జి స్కాం తీర్పు రావడం, మోడీ , డీఎంకే పొత్తు ఊహాగానాలు, వీటిని జగన్ భావి రాజకీయ సమీకరణాలకు ముడిపెడుతూ సోషల్ మీడియాలో పోస్ట్ లు… వీటికి కొనసాగింపుగా బాబు బర్త్ డే విషెస్… చూడాలి జగన్ కు అందిన చంద్రన్న కానుక…. వైసీపీ, తెదేపా ల మధ్య వైరం స్థాయి వ్యక్తిగతo నుంచి రాజకీయo వరకే పరిమితం అయ్యేలా చేస్తుందేమో…