చాలా రోజుల తరవాత ఓ పబ్లిక్ ఫంక్షన్‌కి హాజరయ్యాడు అల్లు అర్జున్. ఈసారీ.. తనకు పవన్ కల్యాణ్ అభిమానుల సెగ గట్టిగానే తగిలింది. ‘ఒక్క క్షణం’ ప్రీ రిలీజ్ ఈవెంట్లో ఎవరు మాట్లాడాలని మైకు పట్టుకొన్నా.. అభిమానులు పెద్ద ఎత్తున గోల చేయడం మొదలెట్టారు. ఎవ్వరినీ మాట్లాడనివ్వకుండా హంగామా చేశారు. ఓ దశలో బన్నీ మైకు పట్టుకొని ఫ్యాన్స్‌కి క్లాస్ పీకేంత వరకూ వెళ్లింది. అయితే ఇదంతా ‘డీజే’ నాటి ఎఫెక్టే అని ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. `చెప్పను బ్రదర్` సెగ బన్నీకి ఏదో ఓ రూపంలో ఎదురవుతూనే ఉంది. ఈ టార్చర్ భరించలేకే… బన్నీ కొన్ని ఫంక్షన్లకు కావాలనే దూరంగా ఉంటున్నాడు. ‘ఒక్క క్షణం’ ఆడియో ఫంక్షన్‌కీ బన్నీ రావాల్సివుంది. కానీ… తను డుమ్మా కొట్టాడు.
ప్రీ రిలీజ్‌కి రాక తప్పని పరిస్థితి. వస్తే… ఇదిగో ఇలా రచ్చ రచ్చ చేశారు. బన్నీ ఎక్కడకు వెళ్లినా.. ఈ తరహా టార్చర్ తప్పేట్టు లేదు. అలాగని ప్రమోషన్లకు రాకుండా, పబ్లిక్ ఈవెంట్లలో పాల్గొనకుండా ఉండాలంటే కష్టం. పైగా తన సినిమా వస్తోందంటే విరివిగా… రావాల్సిందే. ఇవన్నీ దృష్టిలో ఉంచుకొని, పవన్ అభిమానుల్ని కామ్ చేయడానికి బన్నీ ఏదో ఓ స్టెప్ తీసుకోవాల్సిందే. ఈ కథకి శుభం కార్డు వేయడం ఇప్పుడు బన్నీ చేతుల్లోనే ఉంది.