సినీ విమర్శకుడు కత్తి మహేష్, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఉద్దేశించి మరోసారి వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. చంద్రబాబు, పవన్ కళ్యాణ్ ఇద్దరూ తోడుదొంగలేనంటూ వ్యాఖ్యానించారు.
పవన్ కళ్యాణ్ తన నాలుగురోజుల టూర్ సందర్భంగా, DCI ఉద్యోగుల సమస్యలు, ఫాతిమా కాలేజ్ విద్యార్థుల సమస్యల్లాంటి వాటిపై స్పందించిన విషయం తెలిసిందే. అయితే ఫాతిమా కాలేజ్ విషయం లో నిన్న వరస ట్వీట్లతో పవన్ హోరెత్తించాడు. ఈ సమస్య కి పరిష్కారం కనుగొనాల్సిందిగా చంద్రబాబు కి విఙ్ఞప్తి చేసారు. అయితే ఆ ట్వీట్లపై కత్తి మహేష్ ఇప్పుడు స్పందించారు-
“మొత్తానికి ఫాతిమా కాలేజ్ విషయంలో ఇంతకాలానికి చంద్రబాబు ఒకే అన్నాడన్నమాట. ఈరోజు పవన్ కళ్యాణ్ ట్విట్ చేసాడు. తోడుదొంగలు గేమ్ బాగానే ఆడుతున్నారు.”
వైసిపి వర్గాలు ఎప్పటినుంచో ఒక విమర్శ చేస్తున్నాయి బాబు-పవన్ ల జోడీ విషయం లో. అదేంటంటే – చంద్ర బాబు, పవన్ లు ఒక మ్యాచ్ ఫిక్సింగ్ చేసుకుని సమస్యలు పరిష్కరిస్తున్నాయి, ఉద్దేశ్యపూర్వకంగా పవన్ కొన్ని సమస్యలు లేవనెత్తడం, వాటిని వెంటనే చంద్రబాబు పరిష్కరించడం చేస్తున్నారు. దీని వల్ల పవన్ సమస్యలకోసం పాటు పడుతున్న వ్యక్తిగా చిత్రీకరించబడుతున్నాడు. కేవలం, జగన్ ని సైడ్ చేయడానికి బాబు-పవన్ లు ఈ వ్యూహాన్ని అమలు చేస్తున్నారు. ఇదీ వైసిపి వర్గాల వాదన. ఇప్పుడు కత్తి మహేష్ కూడా ఇదే లాజిక్ చెబుతున్నాడు. బాబు-పవన్ లు ఇద్దరూ తోడు దొంగలు అంటూ ఆయన వ్యాఖ్యల వెనుక మర్మం కూడా ఇదే. అయితే ఫాతిమా కాలేజ్ సమస్య కావచ్చు, మరొక సమస్య కావచ్చు, పవన్ బాబు లు ఇద్దరూ కలిసి పరిష్కరిస్తూ ఉంటే అలా పరిష్కరించడాన్ని కూడా తోడు దొంగల వ్యవహారం గా పోల్చడం ఎంతవరకు సబబు అంటూ నెటిజన్ లు ప్రశ్నిస్తున్నారు. వ్యూహం ప్రకారం అయితేనేమి, మరొక రకంగా అయితేనేమి, సమస్యలు పరిష్కరించబడటాన్ని స్వాగతించకుండా, దాని మీద కుళ్ళుకోవడం ఎందుకని నెటిజన్లు కత్తి మహేష్ ని తమ కామెంట్స్ తో ప్రశ్నిస్తున్నారు.
ఐతే ఇటీవల పలు ఛానెల్స్ లో కత్తి మహేష్ ని లైవ్ లో ఉంచి కాల్స్ తీసుకుంటే, చాలా మంది ఫోన్లు చేసి కత్తి మహేష్ తో మాట్లాడకుండా అసలు కత్తి మహేష్ ని స్టూడియోకి తీసుకొచ్చి గంటలు గంటలు ఆయన్ని మా మీద ఎందుకు రుద్దుతున్నారంటూ ఛానెల్స్ పై, యాంకర్ పై జనాలు విసుగు వ్యక్తం చేయడం గమనార్హం.