ఒక్క క్షణం డివైడ్ టాక్‌తో సాగుతోంది. కాన్సెప్ట్ బాగున్నా – నేరేషన్ స్లోగా ఉండడం, ఫస్టాఫ్‌లో విషయం లేకపోవడంతో ఈ సినిమా చూసి పెదవి విరుస్తున్నారు విశ్లేషకులు. అయితే… ఈ మాత్రం అవుట్ పుట్ రావడానికి చిత్రబృందం చాలానే కష్టపడిందని సమాచారం. ముఖ్యంగా అల్లు అర్జున్ రంగంలోకి దిగకపోతే… ఫైనల్ అవుట్ పుట్ మరింత దారుణంగా ఉండేదని టాక్ వినిపిస్తోంది. విడుదలకు ముందు బన్నీ ఈ చిత్రాన్ని ప్రత్యేకంగా వీక్షించి, తనవైన కొన్ని మార్పులు సూచించాడని తెలుస్తోంది. మరీ ముఖ్యంగా ఇప్పుడు ఎండ్ టైటిల్స్ లో వస్తున్న పాట… ఫస్టాఫ్ కోసం కేటాయించిందట. ఆ పాటని కట్ చేయండి అని ఖరా ఖండీగా చెప్పాడట బన్నీ. విడుదలకు ముందు రూ.30 లక్షల బడ్జెట్‌తో ఈ పాటని కావాలనే షూట్ చేశారు. అలాంటిది ఆ పాటని బన్నీ తీసేయమనడం దర్శక నిర్మాతలకు కాస్త ఇబ్బంది కలిగించిందని టాక్. అయితే.. ఆ పాట కట్ చేసి ఎండ్ టైటిల్స్‌లో వేసుకోమన్నాడట. నిజంగానే ఈ పాట ఫస్టాఫ్‌లో వచ్చుంటే సినిమాకి అదనపు ప్రయోజనం జరక్కపోగా… స్ర్కీన్ ప్లే మరింత బోరింగ్‌గా తయారయ్యేది. దాంతో పాటు సినిమాని అక్కడక్కడ ట్రిమ్ చేసి దాదాపు 10 నిమిషాల నిడివి తగ్గించాడట. బన్నీ వేలెట్టకపోతే… కథలో ఈమాత్రం టెంపో కూడా కనిపించకపోయేదని ఇన్ సైడ్ వర్గాలు చెబుతున్నాయి.