ఎన్టీఆర్ ఆల్ టైమ్ సూపర్ హిట్స్ లలో ‘అడవి రాముడు’ ఒకటి. టాలీవుడ్లో కమర్షియల్ కథలకు ఓ కొత్త అర్థాన్నిచ్చిందా సినిమా. ఇప్పుడు రానా ఆ టైటిల్ని మరోసారి గుర్తు చేస్తున్నాడని సమాచారం. ప్రభు సాల్మన్ దర్శకత్వంలో రానా ఓ సినిమాలో నటించబోతున్నాడు. త్వరలోనే ఈ సినిమా పట్టాలెక్కనుంది. అడవి నేపథ్యంలో సాగే కథ ఇది. ఏనుగుల్ని కాపాడడానికి ఓ యువకుడు ఏం చేశాడన్న ఇతివృత్తంలో సాగుతుంది. ఈ చిత్రానికి ‘అడవి రాముడు’ అనే టైటిల్ పెడితే ఎలా ఉంటుందా?? అని చిత్రబృందం ఆలోచిస్తోంది. ఈ టైటిల్ని కూడా రిజిస్టర్ చేసినట్టు తెలుస్తోంది. ‘అడవి రాముడు’ పేరుతో ప్రభాస్ కూడా ఓ సినిమా చేశాడు. అది ఫ్లాప్ అయ్యింది. సూపర్ హిట్ సినిమాల టైటిల్ని తిరిగి వాడుకొంటే.. అంత ఆశాజనకమైన ఫలితాలు రావు అనడానికి ఇదో ఉదాహరణ. మరి రానాకి ఎలాంటి ఫలితాన్ని ఇస్తుందో చూడాలి.