ప్రభాస్ కోసం ఓ కొత్త టైటిల్ పుట్టింది. అదే ‘దందా’. గోపీకృష్ణ సంస్థ తరపున కృష్ఱంరాజు ఈ టైటిల్ని రిజిస్టర్ చేయించారు. ఎప్పుడైతే గోపీకృష్ణ సంస్థలో ఈ పేరు కనిపించిందో… అది కచ్చితంగా ప్రభాస్ కోసమే అని ఆయన అభిమానులు ఫిక్సయిపోయారు. అంతేకాదు… ఈ సినిమాకి కృష్ణం రాజు దర్శకత్వం వహిస్తారని, అందులో ఆయన ఓ స్పెషల్ రోల్ కూడా చేస్తారని ఊహాగానాలు వినిపిస్తున్నాయి.
నిజానికి ప్రభాస్ కథానాయకుడిగా కృష్ణంరాజు దర్శకత్వంలో ఓ సినిమా అనేది ఎప్పటి నుంచో ప్రచారంలో ఉంది. కానీ.. అది ఒక్క మెట్టు కూడా ఎక్కలేదు. ప్రస్తుతం ఉన్న పరిస్థితిలో ప్రభాస్ తన పెదనాన్న దర్శకత్వంలో నటించడం కష్టసాధ్యమైన విషయం. ఒకవేళ పెదనాన్నపై ప్రేమతో ప్రభాస్ ఈ ప్రాజెక్టు ఒప్పుకొన్నా.. కృష్ణంరాజు ఏ మేరకు ఈతరం అభిరుచులకు తగ్గట్టుగా సినిమా రూపొందిస్తారన్నది అనుమానం. అయితే ప్రభాస్ గోపీకృష్ణ బ్యానర్లో ఓ సినిమా చేయడం ఖాయం. దానికి దర్శకుడు మాత్రం కృష్ణంరాజు కాదు. కేవలం నిర్మాతగా వ్యవహరిస్తారు. ప్రభాస్ కోసం ఆయన కొన్ని కథలు వింటున్నారు. అందులో ‘దందా’ ఒకటి. ఎందుకైనా మంచిదని… ఈ టైటిల్ని కృష్ణంరాజు ముందే రిజిస్టర్ చేయించి పెట్టారు. అదీ.. ఈ టైటిల్ వెనుక అసలు కథ.