జనవరి 1న ఫస్ట్ ఇంపాక్ట్ ని చూపిస్తాం అని చిత్రబృందం మాట ఇచ్చినట్టుగానే కొద్ది సేపటి క్రితం ‘నాపేరు సూర్య – నా ఇల్లు ఇండియా’ ఫస్ట్ ఇంపాక్ట్ విడుదలైంది. ఫస్ట్ ఇంపాక్ట్ అంటే లుక్ అనుకున్నారంతా. కానీ.. ఇది టీజర్! కేవలం బన్నీని, అతని భావభావాల్ని చూపించడానికి ఎక్కువ స్పేస్ తీసుకున్న ఈ టీజర్ మెగా అభిమానుల్ని అలరించడం ఖాయంగా కనిపిస్తోంది. ‘ఐ యామ్ ఏ సోల్టర్’ అనే బన్నీ డైలాగ్‌తో టీజర్ మొదలైంది. ‘నీకు సూర్య అంటే సోల్టర్.. కానీ ప్రపంచానికి సూర్య అంటే యాంగర్’ అనే మరో డైలాగ్ వినిపించింది. సూర్య అంటే కోపం.. ఆ కోపాన్ని వివిధ రూపాల్లో ఈ టీజర్లో చూపించారు. ఒకే ఒక్క చోట.. అను ఇమ్మానియేల్‌తో కాస్త రొమాంటిక్ గా ఉండడం తప్ప.. ఈ టీజర్ లో సూర్య తాలుకు కోపమే ఎలిబేట్ అయ్యింది. మిలటరీ డ్రస్సులో బన్నీ లుక్ స్టైలీష్‌గా ఉంది. సరైనోడులానే.. ఇందులోనూ కండలు చూపించాడు. టీజర్ మొత్తం యమ సీరియస్‌గా కనిపించాడు. తను ఈ పాత్ర కోసం పడిన కష్టం అడుగడుగునా కనిపిస్తూనే ఉంది.
మిలటరీ నేపథ్యంలో సాగే కథ అనే సంగతి టీజర్ చూస్తే అర్థమైపోయింది. ఎక్కడ చూసినా… ఆ వాతావరణమే. ‘ఇలాగే కొన్ని రోజులైతే చచ్చిపోతావ్ రా’ అనే రావు రమేష్ డైలాగ్‌కి
‘చచ్చిపోతాను గాడ్ ఫాదర్ కానీ ఇక్కడ కాదు.. బోర్డర్‌కి వెళ్లి చచ్చిపోతాను’ అంటూ బన్నీ సమాధానం ఇవ్వడం.. రోమాలు నిక్కబొడిచే మూమెంటే. టీజర్లో చూపించిన దేశభక్తి తెరపైనా కనిపిస్తే.. ఈ సూర్య బాక్సాఫీసుని బద్దలు కొట్టడం ఖాయం. ఏప్రిల్‌లో ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు వస్తుంది. టీజరే ఇలా ఉందంటే.. ఇక ట్రైలర్ ఏ రేంజులో ఉండబో్తోందో??