టాలీవుడ్లో మరో క్రేజీ కాంబో పట్టాలెక్కబోతోంది. వినోదం పండించడంలో తిరుగులేని స్థానం దక్కించుకున్న హీరోలు అల్లరి నరేష్. సునీల్‌లు కలసి ఓ సినిమా చేయబోతున్నారు. భీమనేని శ్రీనివాసరావు ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తారు. ఇప్పటికే కథ సిద్ధమైంది. ఈ సంక్రాంతికి ఈ చిత్రాన్ని పట్టాలెక్కిస్తారు. నరేష్, సునీల్‌లు గతంలో కొన్ని చిత్రాల్లో నటించారు. అయితే.. సునీల్ హీరో అయ్యాక నరేష్‌తో మళ్లీ సినిమా చేయలేదు. ఇన్నాళ్లకి ఈ కాంబోని తెరపై చూడబోతున్నామన్నమాట. అల్లరి నరేష్‌కీ, సునీల్‌కీ ఈమధ్య విజయాల్లేవు. ఒక్క హిట్ కోసం వెంపర్లాడిపోతున్నారు ఇద్దరూ. మరోవైపు భీమనేని పరిస్థితీ ఇంతే. సుడిగాడు కి ముందూ, తరవాత.. ఆయన ఖాతాలో హిట్లు లేవు. మరి ఈ ముగ్గురికీ ఈ చిత్రం ఎలాంటి ఫలితం ఇస్తుందో చూడాలి. ‘నేనే రాజు నేనే మంత్రి’ చిత్రాన్ని తెరకెక్కించిన సంస్థ… ఇప్పుడు ఈ మల్టీ స్టారర్ కాంబోని పట్టాలెక్కిస్తోంది. త్వరలో పూర్తి వివరాలు తెలుస్తాయి.