పవన్ కల్యాణ్‌తో కేసీఆర్ భేటీ… సర్వత్రా చర్చనీయాంశమైంది. రాజకీయ పరమైన మార్పులకు ఇదో సంకేతంగా రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు. సినిమా పరంగానూ.. ఈ భేటీ ప్రాధాన్యతను సంతరించుకుందనే చెప్పాలి. ఈనెల 10న అజ్ఞాత వాసి విడుదల అవుతోంది. 9న అమెరికాలో ప్రీమియర్లు పడుతున్నాయి. అదే రోజున తెలంగాణలో ప్రీమియర్ షోలకు అనుమతి ఇవ్వాల్సిందిగా పవన్ కేసీఆర్‌ని కోరారని, ఆయన దానికి ఆమోదం తెలిపారని అంటున్నారు. ప్రీమియర్ షోల అనుమతి కోసమే పవన్ – కేసీఆర్‌ని కలిశారని మహేష్ కత్తిలాంటివాళ్లు విమర్శిస్తున్నారు. గత కొంతకాలంగా తెలంగాణలో ప్రీమియర్ షోలకు పర్మిషన్లు ఇవ్వడం లేదు. కాటమరాయుడీకీ బెనిఫిట్ షోలు పడలేదు. అజ్ఞాతవాసి కి మాత్రం లైన్ క్లియర్ చేయాలన్న ఉద్దేశంతో పవన్ రంగంలోకి దిగారన్నది వాదన. అయితే.. ఈ మాత్రం దానికి పవన్ కేసీఆర్‌ని కలవాల్సిన అవసరం లేదు. కేటీఆర్‌తో మాట్లాడినా ఫలితం ఉంటుంది. చిన్న చిన్న విషయాలకు పవన్… ఇలాంటి రాయబారాలు నడపడని.. ఇది కేవలం రాజకీయ పరమైన భేటీ మాత్రమే అని… పవన్ వర్గం వాదిస్తోంది. రేపు.. అజ్ఞాతవాసి ప్రీమియర్లకు అనుమతి లభిస్తే మాత్రం కత్తి మహేష్ వాదనకు బలం చేకూరినట్టవుతుంది. మరి ఏం జరుగుతుందో చూడాలి.