త్రివిక్రమ్ శ్రీనివాస్ సినిమా అంటేనే బోల్డన్నిపంచులూ, కామెడీ బిట్లు. సీన్ డిమాండ్ చేయకపోయినా ఏదోలా కామెడీ చేస్తూ.. ప్రేక్షకుల్ని ఎంటర్టైన్ చేస్తుంటాడు త్రివిక్రమ్. అత్తారింటికి దారేదిలో సెకండాఫ్ డౌన్ అవుతున్నప్పుడు బ్రహ్మానందంని తీసుకొచ్చి… ఓ ట్రాక్ మొత్తం నడిపేశాడు. అందులోనే కాటమరాయుడా.. కదిరి నరసింహుడా పాట మిక్స్ చేసి – సెకండాఫ్ లో కథలేదన్న విషయాన్ని మర్చిపోయేలా చేశాడు. ఇప్పుడు సేమ్ టూ సేమ్ అజ్ఞాతవాసి కి కూడా అదే ఫార్ములాలో వెళ్లాడట త్రివిక్రమ్.
ఈ సినిమా కోసం రెండు వెరైటీ క్యారెక్టర్లని డిజైన్ చేశాడు త్రివిక్రమ్. అదే.. వర్మ, శర్మ. రావు రమేష్ ఏమో వర్మ.. మురళీ శర్మ ఏమో.. శర్మ. సినిమా మొత్తమ్మీద వీళ్లది ఓ సెపరేట్ ట్రాక్ రూపంలో నడుస్తుంటుంది. వీళ్ల మధ్య పేలే పంచ్‌లు.. భలేనవ్వించబోతున్నాయట. కోటేశ్వరరావుగా రఘుబాబు కనిపించబోతున్నాడు. తనని ఆట పట్టిస్తూ సాగే పాటే… కొడకా కోటేశ్వరరావు పాట. ఈ పాటకు ముందే 15 నిమిషాల పాటు సుదీర్ఘమైన ఎపిసోడ్ ఒకటి డిజైన్ చేశాడట త్రివిక్రమ్. అది సూపర్బ్‌గా వర్కవుట్ అయ్యిందని సమాచారం. సెకండాఫ్ మొత్తానికి ఈ ఎపిసోడ్ హైలెట్‌గా నిలవబోతోందని తెలుస్తోంది. సో…. అజ్ఞాతవాసిలో వర్మ, శర్మలపై స్పెషల్ లుక్ వేయాల్సిందే అన్నమాట.