క్రిటిక్ కత్తి మహేష్, పవన్ కళ్యాణ్ మీద కొంతకాలంగా తరచూ విమర్శలు చేయడం తెలిసిందే. ఈ మధ్య పవన్ ని దాటి ఎపి ఎంపీలని, మరొక సందర్భం లో చంద్ర బాబు ని, ఇంకొక అర్చకుడి మీద- ఇలా చాలా మంది మీద ఏదో ఒక రకమైన విమర్శలు చేస్తూ వచ్చాడు. ఇపుడు త్రివిక్రం మీద పడ్డాడు. అఙ్ఞాత వాసి సినిమా ఫ్రెంచ్ మూవీ లార్గోవించ్ కి కాపీ అని ఆ మధ్య రూమర్స్ వచ్చిన విషయం తెలిసిందే. ఆ నోటా, ఈ నోటా ప్రాకి ఇవి ఆ ఒరిజినల్ డైరెక్టర్ దాకా చేరడమూ, ఆయన కూడా స్పందించడమూ తెలిసిందే. అయితే త్రివిక్రం “కాపీ క్యాట్” అన్న టాపిక్ మీద స్పందించాడు కత్తి మహేష్. ఆయన ఏమన్నాడంటే –
‘‘త్రివిక్రమ్ అనే దర్శకుడు కాపీ చెయ్యకుండా రాసిన, తీసిన సినిమా ఒక్కటి కూడా లేదు. కొన్ని సీన్లో, సీక్వెన్సులో, ఏకంగా కథ.. ఇలా ఏదో ఒకటి కాపీ చేస్తూనే ఉంటాడు. లేదా ఒక డైలాగ్ ఆసక్తికరంగా ఉంటే, దాని చుట్టూ కొన్ని సీన్లు అల్లే ప్రయత్నం చేస్తుంటాడు. ముఖ్యంగా యండమూరి వీరేంద్రనాథ్ రచనలలో నుంచీ కొన్ని వాక్యాల్ని.. ఆలోచనల్ని అరువు తెచ్చుకుని తనదైన పదాల్లో అక్కడక్కడా కూర్చి మాయ చేసి మెప్పిస్తుంటాడు. మన ఖర్మ కొద్దీ ఆ మాత్రం రాసే రచయితలు ఎవరు లేక అగ్ర దర్శకుడిగా చలామణి అయిపోతున్నాడు’’
మొత్తానికి త్రివిక్రం లాంటి అగ్ర దర్శకుడిని ని ఇంతలా తీసిపడేయడం కత్తి మహేష్ లాంటి వాళ్ళకే చెల్లింది. కొన్ని కొన్ని సన్నివేశాలు కాపీ కొట్టినా, త్రివిక్రం “మాటల శైలి” ఇవాళ తెలుగుజనాల్లోకి ఎంతలా వెళ్ళిపోయిందో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. మామూలు జనాలు కూడా, తమ దైనందిన జీవితం లో ” నా పాటికి నేను మాడిపోయిన మసాలా దోస తింటొంటే..”, “నాకున్న డౌట్లు చాలు, కొత్త కొత్తవి క్రియేట్ చేయొద్దు”, “బిల్లు మనకి, థ్రిల్లు వాళ్ళకి” లాంటి డైలాగులు విరివిగా వాడుతుండటం చూస్తుంటే, జంధ్యాల తర్వాత ఆ స్థాయిలో తెలుగు ప్రజలతో ఇంతలా మమేకం అయే డైలాగులు వ్రాసింది కేవలం త్రివిక్రం మాత్రమే అని చెప్పొచ్చు. అయినా అలాంటి దర్శకుడిని పూచికపుల్లలా తీసిపడేసే ఇలాంటి విమర్శకులు – ఇలాంటి దర్శకుడు ఏ తమిళ దర్శకుడో అయి ఉంటే మాత్రం ఆయన్ని నెత్తికెత్తుకుని ఆయన మీద తెలుగులో వ్యాసాలు వ్రాస్తూ ఉండేవాళ్ళు.