రానా కథానాయకుడిగా తెరకెక్కుతున్న చిత్రం ‘1945’. తెలుగు, తమిళ, హిందీ భాషల్లో నిర్మిస్తున్నారు. శివ దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో రెజీనా కథానాయిక. షూటింగ్ పూర్తయిపోయింది. ఈ వేసవిలో ఈ చిత్రాన్ని విడుదల చేయనున్నారు. తెలుగులో సి.కల్యాణ్ నిర్మాతగా వ్యవహరిస్తే…. బాలీవుడ్లో మాత్రం రానా నిర్మాత. బాహుబలి, ఘాజీలతో వచ్చిన ఇమేజ్ ఈసినిమా విడుదల విషయంలో తనకు సహాయపడుతుందని రానా నమ్మకం. అందుకే పారితోషికం బదులుగా హిందీ రైట్స్ తన దగ్గరే ఉంచుకున్నాడు. మార్చి నుంచి ప్రమోషన్ వ్యవహారాల్లోకి దిగబోతున్నాడు రానా. హిందీలో తనే నిర్మాత కాబట్టి తన ఫోకస్ అంతా బాలీవుడ్పైనే ఉండబోతోంది. ఈ సినిమాతోనూ రానా విజయం అందుకొంటే… బాలీవుడ్లో (బాహుబలి, ఘాజీ 1945)లో హ్యాట్రిక్ అందుకున్న తొలి దక్షిణాది నటుడు అవుతాడు.