ప్రతినాయక ఛాయలున్న పాత్రలు పోషించడానికి కథానాయకులు ఉత్సాహం చూపిస్తున్నారు. ఈ జాబితాలో అక్కినేని హీరో సుమంత్ కూడా చేరబోతున్నాడు. 2017 చివర్లో మళ్లీ రావాతో కాస్త కోలుకున్నాడు సుమంత్. 2018లో తన నుంచి రెండు సినిమాలు రాబోతున్నాయి. ఓ చిత్రంలో ప్రతినాయక ఛాయలున్న పాత్రలు పోషిస్తున్నాడు. దీనికి అనిల్శ్రీకంఠం దర్శకత్వం వహిస్తున్నాడు. అవసరాల శ్రీనివాస్ దగ్గర సహాయకుడిగా పనిచేశాడు అనిల్. తను చెప్పిన కథ, అందులోని తన పాత్ర బాగా నచ్చాయట. అందుకే సుమంత్ ఈ సాహసానికి పూనుకున్నాడు. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ జరుపుకుంటోంది.
”సుమంత్ ని బుద్దిమంతుడిగా చూపించిన సినిమాలు చాలా వచ్చాయి. నాకూ అలాంటి పాత్రలు చేసీ చేసీ బోర్కొట్టింది. ఈ సినిమాలో మాత్రం నేను బుద్దిమంతుడ్ని కాదు. నా పాత్రలో చాలా కోణాలు కనిపిస్తాయి. ఈ యేడాది చేయబోతున్న మరో సినిమాలోనూ నా పాత్ర కొత్తగా ఉంటుంది. తప్పకుండా 2018 గుర్తుండిపోయే యేడాది అవుతుంది” అని సుమంత్ చెప్పాడు.